నూతన న్యాయవాదులకు ‘క్రాస్ కోడ్’ పుస్తకం ఎంతో ఉపయోగకరం..
- చండూర్‌లో ‘క్రాస్ కోడ్: ది మోడరన్ ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్’ పుస్తక ఆవిష్కరణ

- హైకోర్టు అడ్వకేట్ ఆకుల వెంకట్ రామ్ పటేల్
చండూర్ (నల్గొండ) : నూతన న్యాయవాదులకు న్యాయవృత్తిలో రాణించేందుకు ‘క్రాస్ కోడ్:ది మోడరన్ ఆర్ట్ ఆఫ్ క్రాస్ ఎగ్జామినేషన్’ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హైకోర్టు న్యాయవాది ఆకుల వెంకట్ రామ్ పటేల్ అన్నారు. ఆదివారం చండూర్ మండల కేంద్రంలో రచయిత బొమ్మరగోని కిరణ్ రచించిన ఈ పుస్తకాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆకుల వెంకట్ రామ్ పటేల్ మాట్లాడుతూ, క్రాస్ ఎగ్జామినేషన్‌కు సంబంధించిన అంశాలను తెలుసుకోవడంలో ఈ పుస్తకం నూతన న్యాయవాదులకు ఎంతో దోహదపడుతుందని అన్నారు.న్యాయవృత్తిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి పుస్తకాలు విలువైన మార్గదర్శకాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
చిన్న వయసులోనే రచయిత బొమ్మరగోని కిరణ్ న్యాయరంగానికి ఉపయోగపడే పుస్తకాన్ని రచించడం అభినందనీయమని అన్నారు. జర్నలిజంలో గోల్డ్ మెడలిస్ట్‌గా గుర్తింపు పొందడంతో పాటు, పత్రికల్లో నిరంతరం వ్యాసాలు రాస్తూ,పుస్తక రచనలోనూ ముందుకు సాగడం గొప్ప విషయమని కొనియాడారు. భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడే మరిన్ని మంచి పుస్తకాలను రచించి తన ప్రతిభను చాటుకోవాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయవాదులు నిశాంత్, గద్వాల్ గోవింద్, సీనియర్ పాత్రికేయులు కంచర్ల అంజయ్య, జెర్రిపోతుల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


