నాంపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రజావాణిలో వినత

సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి

నాంపల్లిని కరువు ప్రాంతంగా ప్రకటించాలని ప్రజావాణిలో వినత

 

నాంపల్లి ని కరువు మండల ప్రాంతంగా ప్రకటించాలని నాంపల్లి ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది.ఈ సందర్బంగా సిపిఐ(ఎం) నాంపల్లి మండల కార్యదర్శి నాంపల్లి చంద్రమౌళి మాట్లాడుతూ కరువు మండలంగా ప్రకటించడంతో పాటు, పంటలు నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఒకవైపు వర్షాభావం లేక సరైన సమయంలో వర్షాలు పడకపోవడంతో ఎంతోమంది రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు జరిగిన నష్టాన్ని అంచనా వేయాలని ఆయన అధికారులను కోరారు. ఎల్ నీనో పరిస్థితిలు వాతావరణం మార్పుల నేపథ్యంలో కేంద్రం మద్దతు ధర ప్రకటించిన పంటలన్నీటికి  100% మద్దతు ధరకు కొనుగోలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి కోరారు. ఒకవైపు ఎల్‌నినో ప్రభావం, మరో వైవువ్యవసాయానికి అవసరమైన మేరకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతుల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించకపోతే రైతులతో కలిసి మరిన్ని ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కమిటీ సభ్యులు వాసిపాక ముత్తిలింగం, కొమ్ము లక్ష్మయ్య, తదితరులు పాల్గొన్నారు.

Views: 1

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత