దుర్గాదేవి నవరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

శాకంబరీ మాత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా ఎస్పీ. జిల్లా ప్రజలందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు.

దుర్గాదేవి నవరాత్రి పూజా కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

 

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 12 (విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ పట్టణంలోని బుక్తాపూర్‌లో ఉన్న శాకంబరీ మాత ఆలయం లో ఆలయం వద్ద ఏర్పాటుచేసిన దుర్గా దేవి నవరాత్రి పూజా కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం ఎదురుగా ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహానికి నిర్వహించిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా ప్రజలందరికీ దుర్గా నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. దుర్గా నవరాత్రులు భక్తి, ఆధ్యాత్మికత, శక్తి ఆరాధనకు ప్రతీకలని, ఈ పవిత్ర పండుగను ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో ఘనంగా నిర్వహించుకోవాలని ఆకాంక్షించారు.
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆలయాలకు వచ్చే భక్తులు భక్తి భావంతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని, పండుగ వాతావరణాన్ని ఆనందంగా ఆస్వాదించాలని తెలిపారు. ఉత్సవాల నిర్వహణలో నిర్వాహకులు, భక్తులు పరస్పర సహకారంతో వ్యవహరిస్తూ ప్రశాంతమైన వాతావరణాన్ని కొనసాగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు, భక్తులు, పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Views: 4

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత