బాల్కొండ నియోజక వర్గంలో  బతుకమ్మ సంబరాలు

బాల్కొండ నియోజక వర్గంలో  బతుకమ్మ సంబరాలు

 

బాల్కొండ: నిజామాబాదు జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని అనేక గ్రామాల్లో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు అత్యంత వైభవంగా, ఉత్సాహ భరిత వాతావరణం లో నిర్వ హిస్తున్నారు.బాల్కొండ లోని
నవీన్ పాఠశాల్లోని విద్యార్థిని విద్యార్థులతో బతుకమ్మ ఆడుతూ పూర వీధుల్లో ఊరేగించారు.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ వేడుకల్లో విద్యార్థినీ, విద్యార్థులు,ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, ఉత్సా హంగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా విద్యార్థులు ప్రకృతిలో సహజంగా లభించే గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగు రంగుల పూలను సేకరించి, అందమైన బతుకమ్మలను రూపొందించారు.సంప్రదాయ దుస్తుల్లో ముస్తాబైన విద్యార్థినులు బతుకమ్మల చుట్టూ తిరుగుతూ జానపద గీతాలు ఆలపిస్తూ, చప్పట్లతో ఆడిన ఆటపాటలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా పాఠశాల కరెస్పిండెంట్ ఆకుల నరేందర్ , మాట్లాడుతూ, బతుకమ్మ పండుగ తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి పండుగల నిర్వహణ ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందించడంతో పాటు ప్రకృతి పరిరక్షణ, పర్యావరణ స్పృహ, సామాజిక ఐక్యత వంటి విలువలు అలవడ తాయని తెలిపారు.పూలతో ప్రకృతిని పూజించే బతుకమ్మ పండుగ విశిష్టతను విద్యార్థుల కు వివరించి, మన తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయినీ, ఉపాధ్యా యులు, విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొని బతుకమ్మ సంబరాల్లో భాగంగా జానపద గీతాలు, విద్యార్థుల ఆనందోత్సాహాలతో పండుగ శోభను సంతరించుకుంది.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..! ఈవీ కారులో మంటలు, నలుగురు సజీవదహనం..!
విజయవాడ : విజయవాడ బైపాస్‌ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
భర్త కళ్ళలో కారం చల్లి, చెట్టుకు కట్టేసి కొట్టి చంపిన భార్య..!!
తెలంగాణ గురుకుల జేఏసీ అధ్యక్షుడిగా బి. సురేష్ నాయక్ ఏకగ్రీవ ఎన్నిక
సెకండ్‌ ఫేజ్‌లోనైనా గ్రామ ప్రథమ పౌరుడికి చోటివ్వాలి!
రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుంది- వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
చౌటకూర్ నుంచి తుల్జాపూర్ భవానీ అమ్మవారి ఆలయానికి భక్తుల పాదయాత్ర ప్రారంభం
గంజాయి పట్టుకున్న ఆపరేషన్ కవచ్ సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేత