ప్రభుత్వ పథకాలు పొందేందుకు దరఖాస్తు చేసుకోవాలి
తెలంగాణ సిక్కు సొసైటీ ఆరోగ్య శిబిరంలో ఎమ్మెల్యే ధన్ పాల్...
నిజామాబాద్ ప్రభుత్వ పథకాలు పొందేందుకు అర్హులైన పేదలు దరఖాస్తులు చేసుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే దంపాల్ సూర్యనారాయణ గుప్తా తెలిపారు. తెలంగాణ సిక్కు సొసైటీ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. డబుల్ బెడ్ రూమ్ ఇల్లు పొందేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పేదలైన సిక్కులకు ఇల్లు అందేలా తన వంతు ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆరోగ్య శిబిరం నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పేదలకు ఇలాంటి శిబిరాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. అందరూ ఐక్యమత్యంతో ఉంటూ ప్రభుత్వ పథకాలు పొందాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో తెలంగాణ సిక్కు సొసైటీ అధ్యక్షురాలు తేజ్ దీప్ కౌర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దర్శన్ సింగ్ సోకి, బీజేపీ కార్పొరేటర్ మఠం పవన్, పవన్ ముందడ, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


