ప్రార్థనా మందిర అభివృద్ధికి ఆర్థిక సాయం చేసిన ఉప సర్పంచ్ రఫిక్

చేగుంట : మెదక్ జిల్లా చేగుంట మండలంలోని ఐఓసీ ప్రార్థనా మందిర అవసరాల నిమిత్తం చేగుంట ఉప సర్పంచ్ రఫిక్ ఆర్థిక సాయం అందించారు. ఆదివారం ప్రార్థనా మందిరంలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాస్టర్ ప్రభుదాస్ తో కలిసి ఉప సర్పంచ్ రఫిక్ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం రఫిక్ మాట్లాడుతూ ప్రార్థనా మందిర అభివృద్ధికి తన వంతు సహకారం అందించడం సంతోషంగా ఉందన్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని, చెడుపై మంచి ఎప్పుడూ గెలవాలని తెలిపారు. వర్షాలు బాగా కురిసి పాడి పంటలు పండాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘ పెద్దలు సుధాకర్, మోహన్, డాక్టర్ ప్రభుదాస్, లక్ష్మణ్, జాన్, సైమన్, భక్తపాల్‌తో పాటు యూత్ సభ్యులు మధు, ప్రభు, ప్రశాంత్, ప్రేమ్, జోయల్, అభిలాష్, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


