శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో గాయత్రీ దేవిగా అమ్మవారి దర్శనం...
ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించా
సారంగాపూర్ : నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని శ్రీ మహా పోచమ్మ దేవాలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం రెండో రోజు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి పరిసర ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు.
Views: 47
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Error on ReusableComponentWidget
Latest News
12 Oct 2026 20:26:22
విజయవాడ : విజయవాడ బైపాస్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంతో వెళ్తున్న ఎలక్ట్రిక్ కారు అదుపు తప్పి రహదారి పక్కన ఉన్న రెయిలింగ్‌ను...
