ఒక వైపు వేట . . . మరో వైపు విచారణ

సీఎంఆర్ కుంభకోణం లో సీఐడి దూకుడు మిస్సయినా మిలర్ల కోసం వెతుకులాట కోర్ట్ అనుమతి తో పలువురు మిలర్ల విచారిస్తున్న సీఐడి

ఒక వైపు వేట . . . మరో వైపు విచారణ

నిజామాబాద్ : రాష్ట్రo లో వెలుగు చుసిన సన్న వడ్లు తీసుకొని ఎఫ్ సి ఐ కీ దొడ్డు బియ్యం అంటగాట్టిన కుంభకోణం పై సీఐడి దూకుడు పెంచింది. ఈ కేసులో 16 మంది మిలర్ల కు గాను 14 మంది ని అరెస్ట్ చేయగా ఇద్దరు పరార్ అయినా విషయం విధితమే. ఇద్దరు మిల్లర్లు కోర్ట్ ను ఆశ్రయించి బెయిల్ పొందినట్టు తెలిసింది. రిమాండ్ లో ఉన్న 14 మందిని విచారణ కు సీఐడి కస్టడీ పిటిషన్ దాఖలు చేయగా కోర్ట్ అనుమతించింది.  మిల్లర్ లను ఇవ్వాళ, రేపు విచారణ చేయనున్నారు. ఇదిలా ఉండగా కొన్ని రైస్ మిల్లు లలో భాగస్వాములు ఇప్పటికి పరారీలో ఉండగా వారి కోసం సీఐడి వేట మొదలు పెట్టింది. వారి కోసం గాలింపు చేపట్టింది.
రాష్ట్రం లో 16 రైస్ మిల్లులు 242 కోట్ల విలువైన బియ్యం విషయంలో ప్రభుత్వంను మోసం చేసినందుకు పౌరసరఫరాల శాఖ జనరల్ మేనేజర్ పిర్యాదు మేరకు నిజామాబాద్, కరీంనగర్, ములుగు, మిర్యాలగూడ కు చెందిన మిల్లర్ లపై సీఐడి కేసులు నమోదు చేసి 14 మంది మిల్లర్ లను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అందులో కేవలం నిజామాబాద్ జిల్లా కు చెందిన 6 రైస్ మిల్లు లు ఉన్నాయి. అందులో నలుగురు మిల్లర్ యజమానులు అరెస్ట్ చేయగా వారి పార్టనర్ లు ఎస్కెప్ అయ్యారు. సీఐడి కీ చిక్కకుండ పారి పోయిన వారి కోసం సీఐడి డీఎస్పీ ఆధ్వర్యంలో శుక్రవారం నుంచి గాలిస్తున్నారు. రిమాండ్ లో ఉన్న వారిని విచారిస్తున్నారు. సీఐడి విచారణ లో సన్న వడ్లు తీసుకొని ఏమి చేసారు,వడ్లను అమ్ముకున్నది, ఎలా పక్కదారి పట్టించింది తేలే అవకాశం ఉంది. సన్న వడ్లు తీసుకొని దొడ్డు బియ్యం అప్పగింతలో ఎవరి ప్రయోజనం ఎంత అనే అంశాలు వెలుగు చూసే అవకాశం ఉంది.

Views: 3

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

గుంతలమయంగా మారిన పలుగుతండా - కొండాపూర్ రహదారి ‎ గుంతలమయంగా మారిన పలుగుతండా - కొండాపూర్ రహదారి ‎
కోయిలకొండ :  ‎కోయిలకొండ మండలం పలుగుతండా నుండి కొండాపూర్ వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా తయారైంది. ముఖ్యంగా మార్గమధ్యలోని వాగు బ్రిడ్జి రోడ్డు పూర్తిగా దెబ్బతిని, బీటీ...
40 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేసిన పరిచారకుడు బిక్షపతికి ఘన సన్మానం – వీడ్కోలు
ఎల్‌నినో ప్రభావం.. రైతుల కు ప్రత్యేక కరువు సహాయం అందించాలి !
పేదల పొట్ట కొట్టొద్దు.. కొల్లాపూర్ చౌరస్తాలో ఉపాధిని తొలగించొద్దు - బీఎస్పీ
ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై అవగాహన కల్పించారు.
ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!
నిజామాబాదు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లబాయ్ పటేల్ జయంతి వేడుకలు ఘనంగా నిర్యహణ