అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు!
తెలంగాణ ఉద్యమకారుల సమస్యలు, హామీలను వెంటనే అమలు చేయాల
హుస్నాబాద్ లో తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం శోచనీయమని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కి చెందిన ఉద్యమకారులు తెలిపారు. ఈ సందర్బంగా
మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేసి, స్వరాష్ట్ర కల సాకారం కావడానికి కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులపై కేసులు నమోదు చేయడం, ముందస్తు అరెస్టులకు పాల్పడడం మంచి పద్ధతి కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం హుస్నాబాద్ నియోజకవర్గ కన్వీనర్ మాదాసు శ్రీనివాస్ తీవ్రంగా ఖండించారు..
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల గంగం శ్రావణ్ కుమార్ మైనారిటీ విభాగం అధ్యక్షులు మొహమ్మద్ అంకుశవలి మరియు హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు ఐలేని సంజీవరెడ్డి లను ఈరోజు ఉదయం అరెస్టు చేయడం జరిగిందన్నారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొని, లాఠీ దెబ్బలు తిని, కేసులను ఎదుర్కొని, తమ జీవితాలను సైతం పణంగా పెట్టారని వారు గుర్తుచేశారు. అలాంటి ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారికి ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన ప్రభుత్వం,
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరసన తెలిపే ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని అన్నారు.అరెస్టులతో, కేసులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆపలేరు. ఉద్యమకారుల గొంతును అణచివేయాలని చూస్తే ఉద్యమం మరింత బలపడుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఉద్యమకారులపై ఒత్తిడి తీసుకురావడం మానుకోవాలని, వారి సమస్యలను పరిష్కరించి, ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని, పెండింగ్లో ఉన్న సమస్యల పరిష్కారానికి స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని కోరారు. ఉద్యమకారులను గౌరవించడం అంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వారు చేసిన త్యాగాలను గౌరవించడమేనని స్పష్టం చేశారు.ప్రభుత్వం తమ డిమాండ్లను పట్టించుకోకపోతే తెలంగాణ ఉద్యమకారుల హక్కుల సాధన కోసం ప్రజాస్వామ్య పద్ధతుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


