హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమ ప్రతినిధులు సాయిని ప్రసాద్ నేతృత్వంలో చిన్నయ్యను కలిసి వివరాలు వెల్లడించారు. అనంతరం కార్యక్రమ చైర్మన్ ప్రొఫెసర్ జాడి ముసలయ్యతో ఫోన్‌లో మాట్లాడారు. జాతి ప్రయోజనాల కోసం చేపట్టే కార్యక్రమాలకు అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో డైరెక్టర్ తాళ్లపల్లి రాజేశ్వర్, వైస్ చైర్మన్ బోర్లకుంట ప్రభుదాస్, కో-కన్వీనర్ జాడి గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.

About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

