చౌటకూర్లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
ఎంపీడీవో కే. శంకర్ ఆధ్వర్యంలో నివాళులర్పించిన అధికారులు.
చౌటకూర్ సంగారెడ్డి జిల్లాలో చౌటకూర్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో కే. శంకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పాల్గొని మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మహర్షి వాల్మీకి జీవిత చరిత్ర, ఆయన రచించిన రామాయణ మహాకావ్యం, సమాజానికి అందించిన గొప్ప సందేశాలను స్మరించుకున్నారు. భారతీయ సాహిత్యంలో మహర్షి వాల్మీకి చేసిన సేవలు చిరస్మరణీయమని, ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగసాయి, ఎంఈఓ అనురాధ, ఐసీడీఎస్ సూపర్వైజర్ అమృతవాణి, ఏపీఓ రామ్మోహన్, జూనియర్ సహాయకురాలు కే. శైలజ, కంప్యూటర్ ఆపరేటర్ వహీద్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

