తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.

తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.

తెలంగాణ ఉద్యమకారులను అరెస్టు చేయడం, నిర్బంధించడం సరికాదని బెల్లంపల్లి పట్టణ ఉద్యమకారులు ఖండించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ సాధన కోసం పనిచేసిన వారికి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ఇళ్లు, ఉచిత ప్రయాణ పాసులు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ.20 లక్షల వరకు ఆరోగ్య బీమా కల్పించాలని కోరారు. హామీలు అమలు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు.
సీఎం ఇంటి ముట్టడికి వెళ్తున్న వారిని బెల్లంపల్లి వన్‌టౌన్‌ పోలీసులు నిర్బంధించడాన్ని వారు తప్పుబట్టారు. ఎలిగేటి శ్రీనివాస్, పసులేటి వెంకటేష్, ఎరుకల సుందర్రావు, పరిష రవిశ్వర్, విజ్జగిరి రాజేందర్, చిట్యాల మధు, శంకర్‌సింగ్ తదితరులు ఉన్నారు.

Views: 30

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:

Related Posts

Error on ReusableComponentWidget

Latest News

హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు. హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’కు దుర్గం చిన్నయ్య మద్దతు.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో నిర్వహించనున్న ‘హలో నేతకాని.. ఛలో ఉస్మానియా’ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మద్దతు ప్రకటించారు. వర్గీకరణ అంశంలో నేతకాని సమాజానికి జరిగిన అన్యాయంపై...
నేడు బాన్సువాడ కు మంత్రి సీతక్క రాక.
మహేష్ కుమార్ గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన కాట శ్రీనివాస్ గౌడ్.
చౌటకూర్‌లో ఘనంగా మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు.
మాజీ సర్పంచి మృతికి.
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
తెలంగాణ ఉద్యమకారుల అరెస్టులను ఖండించిన ఉద్యమకారులు బెల్లంపల్లి.