తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీతో జానపద కళాకారులకు కొత్త భరోసా.
కళాకారుల సంక్షేమం, గుర్తింపు కార్డులు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమాపై కీలక చర్చ.
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కవులు, కళాకారులు, రచయితల సమావేశం ఆదివారం బిజినపల్లి మండల కేంద్రంలోని ఆర్.ఆర్. ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సభలో జానపద కళాకారుల సంక్షేమం, కళలకు గుర్తింపు, ఉపాధి అవకాశాలు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా వంటి అంశాలపై ప్రముఖంగా చర్చించారు.
కళాకారుల సంక్షేమమే లక్ష్యం
సభను ఉద్దేశించి పలువురు ప్రముఖులు మాట్లాడుతూ జానపద కళాకారుల అభ్యున్నతికి తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభించడంతో పాటు వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు సంఘం కృషి చేయాలని అన్నారు. కళాకారులందరూ ఐక్యంగా ఉంటూ సంఘాన్ని బలోపేతం చేసుకోవాలని సూచించారు.
సభ్యత్వంతో సంక్షేమ సదుపాయాలు
తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీలో శాశ్వత సభ్యత్వానికి రూ.5,000, సాధారణ సభ్యత్వానికి రూ.3,000గా నిర్ణయించినట్లు సమావేశంలో వివరించారు. సభ్యత్వం పొందిన కళాకారులకు గుర్తింపు కార్డులు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమా వంటి సదుపాయాలు అందేలా కృషి చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 3న సిరిసిల్లలో నిర్వహించనున్న తెలంగాణ ఫోక్ ఇండస్ట్రీ ఆవిర్భావ సభలో కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో కోదాడ శీను, గజ్వేల్ వేణు, ఎద్దుల జంగిరెడ్డి, సంతోష్, జయప్రకాష్, పిట్టలదొర భాస్కర్, డప్పు స్వామి, రవిశంకర్, ఎల్లారెడ్డి, పాము నాగులు, కంచరపల్లి రాజు, బండారి కురుమయ్య, శంకర శ్రీనివాసులు, కొడిదల శ్రవణ్ కుమార్, డి. కృష్ణయ్య, డప్పు లక్ష్మణ్, డప్పు నరసింహ, ఎగిరే బాలు, డాన్సర్ ప్రభాకర్, డప్పు రవి, కాశీదాస్, బోనాస్ రాజు, డప్పు మహేష్ తదితర ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కవులు, కళాకారులు, రచయితలు పాల్గొన్నారు.
పు కార్డులు, ఆరోగ్య కార్డులు, ప్రమాద బీమాపై కీలక చర్చ
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


