నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం.
ముఖ్య అతిథిగా హాజరైన బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు కె.రామాంజనేయులు గౌడ్
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని వీరబద్రియ కుల సంఘం భవనంలో సుబ్బయ్య అధ్యక్షతన BC కులసంఘాల రౌండ్ టేబుల్ సమావేశం ఘనంగా జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కె.రామాంజనేయులు గౌడ్ హాజరై ప్రసంగించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనగణనలో OBC కాలమ్ ఏర్పాటు చేయాలని, ప్రతి కులానికి యూనిక్ కోడ్ కేటాయించాలని డిమాండ్ చేశారు. బీసీ కుల సంఘాలన్నీ సమిష్టిగా ముందుకెళ్లి బీసీ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు.
ప్రధాన నాలుగు డిమాండ్లు:
1. కచ్చితమైన కుల గణన (Accurate Caste Census) నిర్వహించాలి.
2. జనగణనలో ప్రత్యేక OBC కాలమ్ (Separate OBC Column) ఏర్పాటు చేయాలి.
3. ప్రతి కులానికి ప్రత్యేక డ్రాప్‌డౌన్ మెనూ (Drop-down Menu) ఏర్పాటు చేయాలి.
4. ప్రతి కులానికి ప్రామాణిక కుల కోడ్ (Standard Caste Code) కేటాయించాలి.
ఈ నాలుగు డిమాండ్లతో కూడిన ఓబీసీ కాలమ్ జనగణన జరిగినప్పుడే ఖచ్చితమైన లెక్కలు వస్తాయని, సమాన హక్కులు, బీసీల సమగ్ర అభివృద్ధికి తోడ్పడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొఫెసర్ అక్కల బాబు గౌడ్, బీసీ ఐక్యవేదిక రాష్ట్ర కోశాధికారి రంగప్ప యాదవ్, బీసీ చైతన్య వేదిక అధ్యక్షులు వంగ అరుణ్ కుమార్, సత్యశీల సాగర్, వెంకటస్వామి, వాల్మీకి చుక్క శివ, లక్ష్మా యాదవ్ తదితర బీసీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


