బాల్యం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి

బాల్యం నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలి

మత్తు పదార్థాలకు విద్యార్థులు దూరంగా ఉండాలి : కలెక్టర్ రాజర్షి షా

ఆదిలాబాద్ డెస్క్ : బాల్యం నుంచే విద్యార్థులు మంచి అలవాట్లు, క్రమశిక్షణ, సత్ప్రవర్తనను అలవర్చుకోవాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, నైతిక విలువలు, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తుకు బాటలు పడతాయని అన్నారు. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండల కేంద్రంలోని పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన ‘ఆరోగ్య పాఠశాల–ఆరోగ్య జాతర’, మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన 9వ పోషణ్ మాసం కార్యక్రమాలను కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ముందుగా పోషణ్ మాసం సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ ఫుడ్‌ స్టాళ్లను కలెక్టర్ పరిశీలించారు. పౌష్టికాహారం, సమతుల ఆహారం ప్రాధాన్యాన్ని తెలుసుకున్నారు. అనంతరం పీఎం శ్రీ పాఠశాలలోని సెల్ఫీ పాయింట్‌ వద్ద ఫొటో దిగారు. పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన కంప్యూటర్ గదిని ప్రారంభించి, విద్యార్థులతో ఆప్యాయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ, విద్యార్థులలో ఆరోగ్యకరమైన అల వాట్లు, క్రమశిక్షణ, వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించడమే ఆరోగ్య పాఠశాల, ఆరోగ్య జాతర కార్యక్రమాల ప్రధాన ఉద్దేశమన్నారు. విద్యార్థులు చెడు అలవాట్లకు లోనుకాకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గనిర్దేశం చేయాలని సూచించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల యువత భవిష్యత్తు దెబ్బతింటుందని, విద్యార్థులు గంజాయి వంటి మత్తు పదార్థాలకు పూర్తిగా దూరంగా ఉండాలని హితవు పలికారు. గంజాయి సాగు, విక్రయం లేదా వినియోగానికి పాల్పడే వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా విద్యార్థులు బాసర ట్రిపుల్‌ఐటీలో అధిక సంఖ్యలో సీట్లు సాధించేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల్లో ఉన్న ప్రతిభను గుర్తించి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించాలని అన్నారు. కంప్యూటర్‌ విద్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని పోటీ ప్రపంచంలో ముందుకు సాగాలని విద్యార్థులకు సూచించారు. పోషన్ మాసం సందర్భంగా గర్భిణులు, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని కలెక్టర్ అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యాబోధనతో పాటు గర్భిణులు, బాలింతలకు అవసరమైన సేవలు అందుతున్నాయని తెలిపారు. ప్రజలు అంగన్‌వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. జిల్లాలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల పోస్టులను త్వరలోనే భర్తీ చేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, విద్యార్థులు ఆరోగ్య పరిరక్షణ, పోషకాహారం, పరిశుభ్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలపై ప్రదర్శించిన నాటికలు, పాటలు, ఉపన్యాసాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పోషణ్ మాసం ద్వారా లబ్ధి పొందిన మహిళలు తమ అనుభవాలను, అభిప్రాయాలను వేదికపై పంచుకున్నారు ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి మాధవి, తహసీల్దార్ రాజ్‌మోహన్, ఎంఈవో, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకట్‌రావు, సర్పంచ్ రాజన్న, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మేనేజర్ సాయికిరణ్, లీగల్ ఎయిడ్ కౌన్సిలర్లు, సీడీపీవోలు సురేఖ, సౌందర్య, అంగన్‌వాడీ సిబ్బంది, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2026-09-19 at 2.23.56 PM

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.