మంచిర్యాల తహసీల్దార్ అధికారి ఫోన్ నంబర్ "గల్లంతు"

మంచిర్యాల తహసీల్దార్ అధికారి ఫోన్ నంబర్

​మంచిర్యాల టౌన్ : మంచిర్యాల మండల పరిధిలోని ప్రజలకు అత్యంత అందుబాటులో ఉండాల్సిన తహసీల్దార్ అధికారి ఫోన్ నంబర్ పనిచేయకపోవడం (గల్లంతవ్వడం) తో స్థానికులు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెవెన్యూ సమస్యలు, ధరణి/భూ సంబంధిత అర్జీలు, కుల-ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, అత్యవసరమైన పరిణామాలపై అధికారులను సంప్రదించాలనుకునే వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది.  ప్రభుత్వ తహసిల్దార్ కార్యాలయం బోర్డులలో ఉన్న తహసీల్దార్ ఫోన్ నంబర్‌కు కాల్ చేస్తే అది ఆంధ్రాలోని ఒక మహిళకు కేటాయించ బడిందని సదరు మహిళ పేర్కొంటున్నారు. ఇది తహసిల్దార్ నెంబర్ కాదు మీరు డ్రామాలు చేస్తున్నారా మీ మీద పోలీస్ కేసు పెడతానని ఆమె విసిగిపోయి దురుసుగా మాట్లాడడం ప్రజలకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది.  అత్యవసర సమయాల్లో లేదా దూర ప్రాంతాల నుంచి మండల కార్యాలయ  వచ్చేవారికోసం టెంపరరీగా సమాచారం కోసం అక్కడ ఉన్న సిబ్బంది నెంబర్లను తాసిల్దార్ కార్యాలయం బోర్డుపై అతికించారు. అత్యవసర సమయాల్లో దూర ప్రాంతాల నుంచి తహసిల్దార్ కు కాల్ చేస్తే అక్కడున్న సిబ్బంది ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు, సామాన్య ప్రజలకు అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించడం లేదు. ​కాబట్టి తక్షణమే ఏమ్మార్వో ఫోన్ నంబర్ ను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకమైన రెవెన్యూ శాఖ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని, గల్లంతైన ఫోన్ నెంబర్ స్థానంలో పనిచేసే అధికారి నంబర్ ను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా ఉన్నతాధికారులను, కలెక్టర్ కు  స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

 

Views: 538

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు 14వ వార్డులో ఘనంగా బాలగణపతి నవరాత్రి ఉత్సవాలు
  సిద్దిపేట జిల్లా/గజ్వేల్ :  సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు భారత్ నగర్‌లో గరుడ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్నారులు ఏర్పాటు
వీఐపీ యూత్ ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు 
తాడాన్‌పల్లిలో కుళ్లిపోయిన కోడిగుడ్ల పంపిణీ
లోధా కెసా పారడైజోలో భక్తి సందడి గణనాధునికి కోలన్ బాల్ రెడ్డి ప్రత్యేక పూజలు
పదవి బాధ్యత కి కష్టపడి పని చేయాలి 
 ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్ షిప్ లు వెంటనే విడుదల చేయాలి - CSFI డిమాండ్
గోండు గూడలో ఎస్పీ అఖిల్ మహాజన్ జనదర్బార్.