శ్రద్ధానందుడి జీవితం ఎంతో ఆదర్శం
హిందువుల ఐక్యతకు కృషిచేసిన మహానుభావులు.. అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ..
నిజామాబాద్ : స్వామి శ్రద్ధానందుడి జీవితం అందరికీ ఆదర్శమని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు. స్వామి శ్రద్ధానందుడు స్వయంగా రచించిన " కళ్యాణ మార్గ పతికుడు " గ్రంధాన్ని తెలుగు అనువాద పుస్తకాన్ని ఆదివారం నగరంలోని ఆర్యసమాజంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... స్వామి దయానంద సరస్వతి ప్రభావంతో ఆర్య సమాజంలో చేరి అనేక సంస్కరణలను చేపట్టారని తెలిపారు. తన జీవితాన్ని దేశం ధర్మం సమాజ సేవకు అంకితం చేశారని గుర్తు చేశారు. ప్రధానంగా హిందూ సమాజ ం ఐక్యతకు ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. ప్రజల్లో జాతీయ చైతన్యం, స్వాభిమానం పెంపొందించారన్నారు. స్వామి శ్రద్ధానందుని స్ఫూర్తిగా తీసుకొని ఇందూరులో శ్రద్ధానంద్ గంజ్ గా నామకరణం చేయడం ఎంతో గర్వకారణం అన్నారు. అలాగే పుస్తకాన్ని తెలుగులో అనువాదం చేసిన మర్రి కృష్ణారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆర్య సమాజా అధ్యక్షులు విజయ్, ఉపాధ్యక్షులు శ్రావణ్, మంత్రి తిరుమల శ్రీనివాస్, ఆచార్య ప్రణవ కుమార్, పండిత వేద మిత్ర తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

