బిజినపల్లి బాలికల పాఠశాలలో వాసవి క్లబ్, వనిత క్లబ్ సేవా కార్యక్రమాలు
బిజినపల్లి (నాగర్ కర్నూల్) బిజినపల్లి బాలికల ఉన్నత పాఠశాలలో వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రీజినల్ చైర్‌పర్సన్ పోలా చంద్రమౌళి అధికారిక పర్యటన సందర్భంగా ఈ కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పాఠశాలకు వాటర్ ట్యాంక్, అట్లాస్‌లు, పుస్తకాలను పంపిణీ చేశారు. తల్లిదండ్రులు లేని ఇద్దరు బాలికలకు ఒక్కొక్కరికి రూ.2,000 చొప్పున మొత్తం రూ.4,000 ఆర్థిక సహాయం అందజేశారు. పేద విద్యార్థులకు భవిష్యత్తులోనూ చేయూత అందిస్తామని రీజినల్ చైర్‌పర్సన్ పోలా చంద్రమౌళి తెలిపారు. వాసవి క్లబ్ సేవా కార్యక్రమాలను ఆయన వివరించారు. సైన్స్ మ్యాగజైన్ వార్షిక చందా మొత్తాన్ని సోమిశెట్టి ప్రేమ్ కుమార్ హెచ్‌ఎం ప్రసన్నకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ అధ్యక్షుడు సంబు శ్రీనివాసులు, వనిత క్లబ్ అధ్యక్షురాలు సంబు అపర్ణ, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు, క్లబ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


