శివయ్య పల్లి లో భూ రి సర్వే - గ్రామసభ లో పాల్గొన్న మెదక్ ఆర్డిఓ రమాదేవి
పెద్ద శంకరంపేట్ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపడమే లక్ష్యంగా చేపట్టిన సమగ్ర భూ రీ సర్వే భూ భారతి కార్యక్రమంలో పెద్ద శంకరంపేట లోని శివయ్య పల్లి లో ప్రత్యేక భూ రి సర్వే కార్యక్రమం గురువారం నాడు భూ భారతి భూ రి సర్వే, గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి రమాదేవి హాజరై క్షేత్ర స్థాయిలో జరుగుతున్న సర్వే ప్రక్రియను నేరుగా పరిశీలించారు. మెదక్ ఆర్డీవో మాట్లాడుతూ రీ సర్వే వల్ల రైతుల సరిహద్దు వివాదాల పరిష్కారం జరుగుతుందని ఆమె తెలిపారు. ప్రభుత్వం తలపెట్టిన ఈ సమగ్ర భూ సర్వే ద్వారా ప్రతి రైతుకు తమ భూమి ఎక్కడుందో సరిహద్దులు ఎక్కడెక్కడ ఉన్నాయో రైతులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో పేట తాసిల్దార్ నారాయణ, ఆర్ఐ నాగరాజు, సర్వేయర్లు నాగరాణి, శివయ్య పల్లి సర్పంచ్, గ్రామ ప్రజలు తదిరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


