భూ సర్వే ప్రక్రియ ను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన జిల్లా కలెక్టర్
తపాస్ పల్లి గ్రామాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్, అధికారుల బృందం
సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలం తపస్ పల్లి గ్రామాన్ని జిల్లా కలెక్టర్ హైమావతి సందర్శించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం గ్రామంలో చేపడుతున్న భూ సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి కలెక్టర్, ఉన్నతాధికారుల బృందం గ్రామంలో పర్యటించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పుట్ట కనకరాజు మాట్లాడుతూ, భూ సర్వే పనులను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా కలెక్టర్ స్వయంగా అధికారులతో కలిసి తమ గ్రామాన్ని సందర్శించడం సంతోషకరమన్నారు,సర్వేలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా నివారించడానికి అధికారులకు పలు సూచనలు చేశారని, అన్నారు, ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ పాలక వర్గం,స్థానిక ప్రజాప్రతినిధులు, రెవెన్యూ అధికారులు, సర్వే సిబ్బంది, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


