వైద్యులు మందుల చీటీలపై రాసే రాత అర్థం కావడం లేదా?.. ఇకపై ఆ ఇబ్బంది లేదు..!

వైద్యుల ప్రిస్క్రిప్షన్లపై జాతీయ వైద్య కమిషన్ కీలక ఆదేశాలు 

  b0c5fbfd-eb8a-4cfd-982a-40daeccbcdec

జనరిక్ పేర్లతోనే చేతిరాత స్పష్టంగా, అర్థమయ్యేలా ఉండాలని సూచన

హైదరాబాద్ : వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్లు (మందుల చీటీలు) స్పష్టంగా, చదవడానికి వీలుగా ఉండాలని జాతీయ వైద్య కమిషన్ (NMC) స్పష్టం చేసింది. ఈ నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు ప్రతి వైద్య కళాశాలలో ఒక ప్రత్యేక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తాజాగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. 

పర్యవేక్షణకు ప్రత్యేక సబ్-కమిటీ & ఉత్తర్వులు జారీ 

స్పష్టమైన ప్రిస్క్రిప్షన్ అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం ప్రజల ఆరోగ్య హక్కులో అంతర్భాగమని హైకోర్టు తన తీర్పులో పేర్కొన్న విషయాన్ని ఎన్ఎంసీ గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ప్రతి మెడికల్ కాలేజీలోని డ్రగ్స్ అండ్ థెరప్యూటిక్స్ కమిటీ (డీటీసీ) కింద ఒక సబ్-కమిటీని ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ కమిటీ ప్రిస్క్రిప్షన్లను క్రమం తప్పకుండా సమీక్షిస్తుంది. వైద్యులు మందులు రాసే పద్ధతులను పరిశీలించి, నిబంధనల ఉల్లంఘనలను గుర్తిస్తుంది. వాటిని సరిదిద్దడానికి అవసరమైన చర్యలను సిఫార్సు చేస్తుంది.

Views: 124

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు సుల్తాన్‌పూర్‌లో 25 ఇంకుడు గుంతలకు మార్కౌట్.. రెండు డ్రైన్ ఎండ్ పాయింట్ల గుర్తింపు
చౌటకూర్ : చౌటకూర్ మండల పరిధిలోని సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీలో భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణే లక్ష్యంగా గురువారం సామూహికంగా 25 ఇంకుడు గుంతల నిర్మాణానికి...
చరిత్రను వక్రీకరించినవాడే చరిత్రహీనుడు!- సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి
బస్వాపూర్‌లో ఘనంగా సదర్ సమ్మేళనం.. ముఖ్య అతిథిగా మఠం బిక్షపతి
సంస్కార్ విద్యాలయ లో యోగ సంస్థాన్ పిట్లం ఆధ్వర్యం లో యోగ సాధన
15న రైతు బహిరంగ సభను జయప్రదం చేయండి......సిఐటియు రాష్ట్ర కమిటీ సభ్యులు చిన్నపాక లక్ష్మీనారాయణ......
పరిశుభ్రతలో మోర్తాడ్ ప్రథమ స్థానంలో నిలవాలి
పాలమూరు గడ్డపై అండర్-14 క్రికెట్ సంచలనం.. 77 బంతుల్లోనే 111 పరుగులు చేసి వీరవిహారం చేసిన సాయి వరుణ్! ‎