రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్ నిర్వహణ ప్రతిజ్ఞ
కామారెడ్డి బ్యూరో : కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం లో భారతదేశ ఉక్కు మనిషి, తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీయ ఏక్తా దివస్ (జాతీయ ఐక్యతా దినోత్సవం) సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ జానకి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సమగ్రత, ఐక్యత, సమైక్యత కోసం సర్దార్ వల్లభభాయ్ పటేల్ చేసిన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకుని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తాసిల్దార్ శృతి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Views: 16
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Related Posts

Error on ReusableComponentWidget
Latest News
31 Oct 2026 14:48:56
అందోల్ : మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలంలోని సీతానగర్ గ్రామంలో శనివారం భూభారతి భూముల డిజిటల్ రీ సర్వేకు అవగాహన సదస్సు లో ముఖ్య అతిథులుగా హాజరైన...
