రోడ్డుపై గుంత.. మురుగునీటితో దుర్గంధం.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

రోడ్డుపై గుంత.. మురుగునీటితో దుర్గంధం.. అధికారుల నిర్లక్ష్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

చేగుంట: చేగుంట మండలం చిన్నశివునూర్ గ్రామ శివారులో చేగుంట–గజ్వేల్ ప్రధాన రహదారిపై స్థానిక ఎల్లమ్మ దేవాలయం సమీపంలో ఏర్పడిన పెద్ద గుంతను దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. రహదారిపై ఏర్పడిన గుంతలో పరిసర ఇళ్ల నుంచి వెలువడుతున్న మురుగునీరు చేరడంతో ఆ ప్రాంతమంతా దుర్గంధభరితంగా మారింది. ప్రధాన రహదారిపై గుంత ఉండటంతో వాహనదారులు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ పరిస్థితిని గమనించిన ఎమ్మెల్యే రహదారి దుస్థితిని స్వయంగా పరిశీలించి, సమస్య పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యం వాహనాలు రాకపోకలు సాగించే ప్రధాన రహదారిపై ఇంత పెద్ద గుంత ఏర్పడినా సంబంధిత అధికారులు ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మురుగునీరు రోడ్డుపైకి చేరడం వల్ల స్థానికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు, ఈ కార్యక్రమంలో

ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యపై సంబంధిత అధికారులు తక్షణమే స్పందించి రహదారిపై గుంతను మరమ్మతు చేయడంతో పాటు మురుగునీరు రోడ్డుపైకి చేరకుండా శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే సూచించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత ప్రభుత్వ పాఠశాల అభివృద్దికి ఉపాద్యాయురాలి చేయూత
స్టేషన్ ఘన్‌పూర్ :  ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహకారం అందించాలని, విద్యార్థులకు మెరుగైన విద్యా సదుపాయాలు కల్పించేందుకు ముందుకు రావాలని ఎంఈవో...
గుంతలమయంగా మారిన పలుగుతండా - కొండాపూర్ రహదారి ‎
40 సంవత్సరాల సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ చేసిన పరిచారకుడు బిక్షపతికి ఘన సన్మానం – వీడ్కోలు
ఎల్‌నినో ప్రభావం.. రైతుల కు ప్రత్యేక కరువు సహాయం అందించాలి !
పేదల పొట్ట కొట్టొద్దు.. కొల్లాపూర్ చౌరస్తాలో ఉపాధిని తొలగించొద్దు - బీఎస్పీ
ప్రభుత్వ పాఠశాలలో నేరా చట్టాలపై అవగాహన కల్పించారు.
ఒకే పార్టీ.. వేర్వేరు నివాళులు..!