భూసేకరణ భూముల వివరాలు భూ భారతిలో నమోదు చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

భూసేకరణ భూముల వివరాలు భూ భారతిలో నమోదు చేయాలి : కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్

నాగర్‌కర్నూల్ :  భూసేకరణ భూముల వివరాలను భూ భారతి రికార్డుల్లో తప్పనిసరిగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ నీటిపారుదల శాఖ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సాగునీటి ప్రాజెక్టులు, ప్రధాన కాలువల కోసం సేకరించిన భూముల వివరాలను భూ భారతి పోర్టల్‌తో పాటు రెవెన్యూ రికార్డుల్లోనూ నమోదు చేయడం తప్పనిసరి అన్నారు. సంబంధిత మండలాల తహసీల్దార్లతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో 75 గ్రామాల్లో కొనసాగుతున్న భూముల రీ-సర్వే ప్రక్రియపై సమీక్షించారు. ఇప్పటివరకు 15 గ్రామాల్లో రీ-సర్వే పనులు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. నీటిపారుదల శాఖకు బదిలీ చేసిన భూములను ప్రభుత్వ భూములుగా గుర్తించాలని, రీ-సర్వేలో సేకరించిన భూముల వివరాలను పక్కాగా నమోదు చేయాలని ఆదేశించారు. పెండింగ్‌లో ఉన్న భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ బి. చెన్నయ్య, భూసేకరణ ప్రత్యేక అధికారి అరుణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Views: 12

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

*రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా *రిమ్స్‌లో పెండింగ్ పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి..... జిల్లా కలెక్టర్ రాజర్షి షా
ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు, పెండింగ్ సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి...
రేపే ప్రారంభం కానున్న ఎస్‌ఎల్‌ఎన్ సౌభాగ్య ప్రీమియా వెంచర్
నవంబర్ 30న తుది ఓటరు జాబితా విడుదల
బతికుండగానే చనిపోయినట్లు నమోదు.. పెన్షన్ కట్‌!
నాగర్‌కర్నూల్ జిల్లా ఉప్పునుంతల తహసీల్దార్ సస్పెన్షన్ అక్రమ భూ రిజిస్ట్రేషన్ వ్యవహారంలో కలెక్టర్ వేటు
ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు
సింగూరు ప్రాజెక్టు నుంచి 0.15 టీఎంసీల నీటి విడుదల