*షార్ట్ సర్క్యూట్‌తో పత్తి దహనం –
బాధిత కుటుంబానికి అండగా నిలిచిన డీసీసీ అధ్యక్షులు . నరేష్ జాదవ్
*ఆదిలాబాద్ బ్యూరో : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలోని తోషం తండా గ్రామంలో ఆడే శీల గోవింద్ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ఇంట్లో నిల్వ ఉంచిన పత్తి దగ్ధమైంది.
ఈ ఘటన జరిగిన సమయంలో అదే ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులు *డా. నరేష్ జాదవ్ వెంటనే స్పందించి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి స్వయంగా నీటితో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. సమయస్ఫూర్తితో స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావడంతో మరింత పత్తి దగ్ధం కాకుండా కొంతమేర కాపాడగలిగారు.
ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే నరేష్ జాదవ్ బాధిత కుటుంబానికి అండగా నిలిచి, జరిగిన పంట నష్టాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా తగిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని భరోసా ఇచ్చారు.
ప్రజలకు కష్టం వస్తే ముందుండి స్పందించడమే నిజమైన నాయకత్వానికి నిదర్శనం అని ఈ సందర్భంగా గ్రామ ప్రజలు అభిప్రాయపడ్డారు. ఒక జిల్లా స్థాయి నాయకుడిగా మాత్రమే కాకుండా, ఆపద సమయంలో ప్రజల మధ్యకు వచ్చి స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొన్న నరేష్ జాదవ్
సేవా తత్పరత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రజా నాయకుడు మన ఆదిలాబాద్ జిల్లాకు ఉండటం గర్వకారణమని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నరేష్ జాదవ్*తో పాటు బోథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ *మల్లెపూల సత్యనారాయణ, సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులు *అసిఫ్ ఖాన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

