మనోహరాబాద్లో ఒక్కసారిగా భారీ వర్షం
అన్నదాతల్లో ఆనందం.. పంటలకు మేలు జరుగుతుందని ఆశలు
మనోహరాబాద్ : మనోహరాబాద్ మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో శనివారం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆకాశం మేఘావృతమై ఉండగా, మధ్యాహ్నం 2 గంటల నుంచి వర్షం ప్రారంభమైంది. తొలుత స్వల్పంగా మొదలైన వర్షం క్రమంగా తీవ్రత పెంచుతూ అరగంటకు పైగా కురిసింది.వర్షంతో వాతావరణం చల్లబడటంతో పాటు రైతుల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు ఈ వర్షం కొంతమేర ప్రయోజనం చేకూరుస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మండలంలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే వరి కోతలు ప్రారంభమయ్యాయి. ఈ సమయంలో కురిసిన వర్షంతో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట విషయంలో రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


