నాగర్ కర్నూల్‌లో పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగింపు

చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలి: డీఈఓ రమేష్ కుమార్

నాగర్ కర్నూల్‌లో పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగింపు

నాగర్ కర్నూల్ :

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో రెండు రోజులపాటు నిర్వహించిన పీఎం శ్రీ పాఠశాలల జిల్లాస్థాయి క్రీడా పోటీలు ముగిశాయి. జిల్లాలోని 24 పీఎం శ్రీ పాఠశాలల విద్యార్థులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. కబడ్డీ, వాలీబాల్, పరుగుపందాలు, లాంగ్‌జంప్, షాట్‌పుట్, త్రోబాల్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ, విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించాలని సూచించారు. క్రీడల వల్ల విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని అన్నారు. అండర్-17 బాలుర వాలీబాల్‌లో లింగాల్ TGWREIS పాఠశాల ప్రథమ స్థానం, అంబటిపల్లి జెడ్పీహెచ్‌ఎస్ ద్వితీయ స్థానం సాధించాయి. బాలికల వాలీబాల్‌లో కల్వకుర్తి ఎంజేపీ పాఠశాల ప్రథమ బహుమతి, ఇనోల్ TGWREIS పాఠశాల ద్వితీయ స్థానం పొందాయి. అనంతరం విజేతలకు డీఈఓ రమేష్ కుమార్ మెమొంటోలు అందజేసి అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాలల సిబ్బంది పాల్గొన్నారు.

Views: 13

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం పక్షవాతంతో బాధపడుతున్న మహిళకు తోటి విద్యార్థుల ఆర్థిక సాయం
నాంపల్లి :  అనారోగ్యంతో బాధపడుతున్న మహిళకు ఆపన్నహస్తం అందించి మానవత్వాన్ని చాటుకున్నారు. నాంపల్లి మండలం మహమ్మదాపురం గ్రామానికి చెందిన 2005–06 విద్యా సంవత్సరంలో పదో తరగతి, ఏడో...
కొయిలకొండలో ఘనంగా CWSN విద్యార్థుల క్రీడా పోటీలు.. ఉత్సాహంగా పాల్గొన్న ప్రత్యేక ప్రతిభావంతులు ‎
ఎమ్మల్సీ ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలి -- ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ఇంద్రవెల్లి సభకు తరలిరావాలి
అచ్చంపేటలో నవంబర్ 22న ప్రజాయుద్ధనౌక గద్దర్ విగ్రహావిష్కరణ - కరపత్రం విడుదల
ఘనంగా రవీందర్ రెడ్డి వర్ధంతి వేడుకలు
దొంతి గ్రామ అభివృద్ధికి శ్రీకారం