నవంబర్ 5నుండి కేంద్రమంత్రి బండి సంజయ్ మహా పాదయాత్రను విజయవంతం చేయాలి
హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామశాఖ బీజేపీ బూత్ కమిటీ సమావేశం, బూత్ కమిటీ పనితీరు పరిశీలన మరియు మహా పాదయాత్రకు హాజరయ్యే కార్యకర్తల వివరాల నమోదు సమావేశం జరిగింది.ప్రజాస్వామ్యాన్ని రక్షిద్దాం,విద్రోహక వాదులను తరిమికొడదాం అనే నినాదంతో నవంబర్ 05.వ తేదీన కరీంనగర్ పార్లమెంట్ కేంద్రం అయిన కరీంనగర్ పట్టణంలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న మహా పాదయాత్రను విజయవంతం చేయాలని బీజేపీ నాయకులు పిలుపునిచ్చారు.ఈ మహా పాదయాత్రకు సంబంధించి పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడం, బూత్ కమిటీల పనితీరును పరిశీలించడం, కమిటీలను సమీక్షించడం, పాదయాత్రలో పాల్గొనే కార్యకర్తల వివరాలను సేకరించడం వంటి కార్యక్రమాల్లో భాగంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు కోహెడ మండలం తీగలకుంటపల్లి గ్రామంలో గురువారం రోజున సాయంత్రం బీజేపీ గ్రామశాఖ బూత్ కమిటీ సమావేశం బీజేపీ గ్రామశాఖ బూత్ అధ్యక్షుడు ఇట్టిరెడ్డి అమర్ రెడ్డి అధ్యక్షతన శక్తికేంద్రాల ప్రభారీలు మ్యాకాల రజినీకాంత్ రెడ్డి, మ్యాకాల సురేందర్ రెడ్డి గార్ల నేతృత్వంలో జరిగింది.ఈ కార్యక్రమానికి బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం తో కలిసి బిజెపి కోహెడ మండల అధ్యక్షుడు జాలిగం రమేష్ హాజరై మాట్లాడుతూ ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కార్యకర్తలకు సూచించారు. ప్రతి బూత్‌లో పార్టీ కమిటీలు క్రియాశీలకంగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు మండలంలోని 27.గ్రామాల్లో 52.బూత్ కమిటీల్లో బిజెపి బూత్ కమిటీల సమావేశంతో పాటుగా బీజేపీ గ్రామశాఖ బూత్ కమిటీల పనితీరు పర్యవేక్షించి పార్టీ బాధ్యత ఉండి నేటివరకు పనిచేయని అందుబాటులో ఉండని ఇతరత్రా సమస్యలతో పార్టీకి సమయం ఇవ్వలేని వారు బూత్ కమిటీలో ఉంటే వారి స్థానాల్లో పనిచేసేందుకు ఆసక్తి ఉండి ముందుకు వచ్చే వారిని ఆయా బూత్ కమిటీల సమావేశాల్లో కార్యకర్తల సమక్షంలో అవకాశం ఇచ్చి పార్టీని మరింత ముందుకు తీసుకపోయేలా సమాయత్తం చేసేందుకు కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదేశాలతో చేస్తున్నామని అన్నారు.నవంబర్ 05.న కరీంనగర్లో నిర్వహించనున్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ మహా పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రతి బూత్ నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొనేలా సమన్వయంతో పనిచేయాలని కోరారు. ఇందులో భాగంగా బూత్ కమిటీలను పరిశీలించి, పాదయాత్రకు హాజరయ్యే కార్యకర్తల వివరాలను నమోదు చేసి, కార్యక్రమ విజయానికి అవసరమైన ముందస్తు ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ బిజెపి మండల కార్యదర్శి రాగుల మహేష్ యాదవ్, వివిధ బాధ్యతల్లో ఉన్న నాయకులు, పార్టీ శ్రేణులు గుడిపెల్లి వేణుగోపాల్, కొమ్మిడి బాల్ రెడ్డి, ఇట్టిరెడ్డి రాజిరెడ్డి, బట్టు రవీందర్ రెడ్డి, అమ్మిడి రవీందర్, రాగుల రంజిత్, రేవోజు శంకర్, పులగుర్ల రాజిరెడ్డి, కుకట్ల శ్రీశైలం, మూల లక్ష్మారెడ్డి, కొమ్మిడి సంజీవరెడ్డి, దొంగల మహేందర్ రెడ్డి, మెతుకు రాజిరెడ్డి,మెతుకు సంజీవరెడ్డి, మెతుకు రాజిరెడ్డి,కరెడ్ల బాపురెడ్డి, కోతి రాజయ్య, నక్క రాజిరెడ్డి, తడకల సంజీవరెడ్డి, తడకల అజయ్ రెడ్డి, మ్యాకాల రాజిరెడ్డి, మెట్టు సంజీవరెడ్డి, మూల రాజిరెడ్డి, కరెడ్ల వెంకటరెడ్డి, చిలుపురి రాంరెడ్డి, రాజయ్య, జాలిగం మల్లయ్య, జాలిగం బాలయ్య, పెరుగు సంజీవరెడ్డి, రాగుల రాజు, రాగుల హర్షిత, ఇట్టిరెడ్డి బాల్ రెడ్డి, తదితరులు హాజరయ్యారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


