వాల్మీకి మహర్షి జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం.
మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను బీజేపీ ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలోని కోదండ రామాలయంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి చిత్రపటానికి పూలమాల వేసి, దీపం వెలిగించి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు అమురాజుల శ్రీదేవి, బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు కొయ్యల ఏమాజీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు శ్రీకృష్ణదేవరాయలు మాట్లాడుతూ.. వాల్మీకి మహర్షి జీవితం పరివర్తనకు, ఆలోచనలకు, స్ఫూర్తికి ప్రతీక అని పేర్కొన్నారు. ఆదికవిగా ప్రసిద్ధి చెందిన వాల్మీకి రచించిన రామాయణం భారతీయ సంస్కృతి, ధర్మం, నైతిక విలువలకు మార్గదర్శకమన్నారు. యువత ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకుని విద్య, నైతిక విలువలు, సామాజిక బాధ్యతలకు ప్రాధాన్యమిస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బొల్లెడ్ల కేశవరెడ్డి, ఎస్సీ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు నర్సింగ్ రాజు, జిల్లా కార్యదర్శి సీహెచ్ స్వామి, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ కాసిపాక గంగారం, జిల్లా కౌన్సిల్ సభ్యుడు శనిగారపు శ్రావణ్, బీజేపీ నాయకులు నస్పూరి లక్ష్మణ్, గంపల నరేష్, రామ్ హరీష్, డోలే చంద్రకాంత్, దుర్గం భరత్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


