మునుగోడులో ఘనంగా సుంకరి బిక్షం గౌడ్ విరమణ వేడుక.
హాజరైన ఎమ్మెల్యే రాజ్ గోపాల్ రెడ్డి., కమిట్మెంట్,కృషికి మారుపేరు బిక్షం గౌడ్.
సమాజ సేవ కొనసాగించాలి: రాజ్ గోపాల్ రెడ్డి.
మునుగోడు : మునుగోడు పట్టణంలోని పీఆర్ఆర్ గార్డెన్ లో పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర సంఘం మాజీ అధ్యక్షుడు, మునుగోడు ఎంపీపీఎస్ ప్రధానోపాధ్యాయులు సుంకరి బిక్షం గౌడ్ ఉద్యోగ విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
బిక్షం గౌడ్ శాలువాతో ఘనంగా సన్మానించి,ఉద్యోగ విరమణ శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా రాజ్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ బిక్షం కమిట్మెంట్ ఉంటే ఏ పనైనా చేయొచ్చు అనడానికి బిక్షం గౌడ్ నిదర్శనమన్నారు.కృషి, పట్టుదల,దీక్షకు మారుపేరు బిక్షం గౌడ్,ఉపాధ్యాయుడుగా కమిట్మెంట్ తో పని చేస్తూ ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచిన ఘనత ఆయనదన్నారు.ఇటువంటి వ్యక్తులకు రిటైర్మెంట్ అనేది ఉండదు,ఇన్ని రోజులు ఉపాధ్యాయుడుగా సేవలందించారు.నీలాంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి సమాజానికి సేవ అందించాలని బిక్షం గౌడ్ కు మొట్టమొదట చెప్పిన వ్యక్తిని నేనేనని ఎమ్మెల్యే అన్నారు. సమాజంలో అవినీతి పేరుకు పోతుంది.అవినీతి పారద్రోలేంత వరకు పేదలకు న్యాయం జరగదన్నారు. నాయకుడనేవాడు నీతిగా ఉంటే సమాజానికి నీతి వంతమైన పాలన అందించగలరనీ,నాయకులు అవినీతికి పాల్పడితే సమాజంలో పేదలకు న్యాయం జరగదని చెప్పారు.కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ,బడుగు బలహీన వర్గాల పార్టీఅన్నారు.
పీఆర్టీయూ అభ్యర్థిగా సుంకరి బిక్షం గౌడ్ కాంగ్రెస్ పార్టీ మద్దతు కావాలని ప్రయత్నం చేశాను.బీసీలకు పెద్దపీట వేయాలనే ఉద్దేశంతోనే బీసీ బిడ్డ సుంకరి బిక్షం గౌడ్ కి టికెట్ ఇవ్వాలని చెప్పానని, ప్రజలే న్యాయ నిర్ణేతలు ప్రజల నిర్ణయానికి వదిలేయాలన్నారు. 9 వేల కోట్లతో కొడంగల్లో సీఎం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్నారు. కొడంగల్ కి అభివృద్ధి పనులు ఇవ్వొద్దనేది నా ఉద్దేశం కాదనీ, కానీ మునుగోడు ప్రజలు ఏం పాపం చేశారని,మాకెందుకు నిధులు రావని ఆవేదన వ్యక్తం చేశారు.నీకు అదృష్టం కలిసి వచ్చి ముఖ్యమంత్రి అయ్యావు,దానిని నేను తప్పు పట్టడం లేదు.ప్రపంచంలోనే అత్యధికంగా ఫ్లోరైడ్ తో బాధపడుతున్న మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలన్న తపన నాకు ఉందని తెలిపారు.ఎమ్మెల్యేల నియోజకవర్గాలను కూడా ముఖ్యమంత్రి,మంత్రులు సమానంగా చూడాలి. ముఖ్యమంత్రి దగ్గరికి,ఉప ముఖ్యమంత్రి భట్టి దగ్గరికి చాలాసార్లు వెళ్లాను.ప్రభుత్వం ఇప్పటికైనా గ్రహించి మునుగోడుతో పాటు వెనుకబడిన నియోజక వర్గాలను గుర్తించి,ఆ నియోజకవర్గాలకు న్యాయం చేయాలని కోరుతున్నా అని అన్నారు.ఈ కార్యక్రమంలో పీఆర్టీయూ నాయకులు, ఉపాధ్యాయులు,విద్యార్థులు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


