డీఈవో చేతుల మీదుగా బహుమతులు అందుకున్న సిద్ధార్థ విద్యార్థులు
నాగర్ కర్నూల్ జిల్లా, (ఫోటో జర్నలిస్ట్ మల్లేష్ బాబు) : జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ వైజ్ఞానిక ప్రదర్శన సందర్భంగా తెలకపల్లి మండల కేంద్రానికి చెందిన సిద్ధార్థ మోడల్ స్కూల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికైనట్లు పాఠశాల ప్రిన్సిపల్ ఎం శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లో జరిగిన జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు రాజు, నవీన్ కుమార్ ప్రదర్శించిన కెమో కూల్ ఫ్రిడ్జ్ తయారు చేసిన ఈ విద్యార్థులకు జిల్లా స్థాయిలో రెండవ బహుమతి డీఈవో రమేష్ కుమార్ చేతుల మీదుగా అవార్డులు ప్రశంస పత్రాలు అందుకున్నారు. ఈ విద్యార్థులు రాష్ట్ర స్థాయిలో జరిగే జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులను పాఠశాల సిబ్బంది ఘనంగా సన్మానించి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు రామ్, సతీష్ గౌడ్, ఆంజనేయులు, శ్రావణ్, భాగ్యశ్రీ, కిరణ్ కుమార్, విద్యార్థుల విద్యార్థులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


