క్రెడిట్ కార్డ్ స్వైపింగ్ మెషిన్ ద్వారా లక్షల్లో మోసం...!!

డబ్బు స్వాహా చేసిన నిందితుడి అరెస్టు : ఏసీపీ హన్మకొండ నరసింహ రావు

హన్మకొండ (విజన్ ఆంధ్ర) : క్రెడిట్ కార్డ్ ల ద్వారా కమిషన్ తీసుకోకుండా డబ్బులు  ఇప్పిస్తాను అంటూ బాధితుల నుండి లక్షల్లో డబ్బు స్వాహా చేసిన మోసగాడిని హన్మకొండ పోలీసులు బుదవారం రోజున అరెస్టు చేసారు. నిందితుడి నుండి పోలీసులు తాను ట్రాన్సక్షన్ కి ఉపయోగించిన హెచ్పి  కంప్యుటర్ మానిటర్, డి ఈ ఎల్ ఎల్   సి పి యు, హెచ్డిఎఫ్సి  స్వయిపింగ్ మిషన్ మరియు రెండు  సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుకు సంబంధించి హన్మకొండ ఏసిపి పి. నరసింహ రావు వివరాలను వెల్లడిస్తూ  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం, మడిపల్లి గ్రామానికి చెందిన నిందితుడు నేరెళ్ళ అరుణ్ తండ్రి: సదానందం (31) అను అతడు 2023 వ సంవత్సరంలో హన్మకొండ లోని రాయపురలో భద్రకాళి డిజిటల్ సేవ షాప్ పెట్టి తన యొక్క షాపులో ఆన్లైన్ అప్లికేషన్స్ చేసేవాడు తరువాత అతడు ఇంస్టాముద్ర అప్ కి మరియు షాద్వాల్ పే అప్ కి ఫీజు కట్టి డిస్ట్రిబ్యుటర్ ఐ.డి తీసుకొని తన దగ్గరికి నగదు డబ్బు అవసరం నిమిత్తం వచ్చే కస్టమర్ల క్రెడిట్ కార్డు స్వైప్ చేసి వారికి డబ్బులు ఇచ్చేవాడు.
 
దానికిగాను  వీసా కార్డ్ కి 1.8 %, మాస్టర్ కార్డ్ కి 2.6 %, బిజినెస్ కార్డ్ కి 4 %, రూపే కార్డ్ కి 1.8 % వారిగా డబ్బులు తీసుకునేవాడు. తన దగ్గరికి రెగ్యులర్ గా వచ్చే కస్టమర్లను తన వ్యాలెట్ లో యాడ్ చేసుకొని వారి క్రెడిట్ కార్డులలో బ్యాలెన్స్ ఉంటె వారికి ఫోన్ చేసి తాను వేరే పేమెంట్ చేసేది ఉంది అని చెప్పి వారి కార్డులు స్వైప్ చేసి వారికి ఎటువంటి చార్జెస్ లేకుండా తానే వారి క్రెడిట్  కార్డుల బిల్లులు కడతానని వారిని మోసపూరితంగమైన మాటలు చెప్పి నమ్మించి  కార్డులు స్వైప్ చేసిన తరువాత వేరే కస్టమర్ల కార్డులు  పేమెంట్ చేసి  దానికి 4 % వరకు చార్జ్ తీసుకొని లాభపడేవాడు , తరువాత తన బ్యాంకు ఎకౌంట్ హోల్డ్ అయ్యినది  రెండు రోజుల తరువాత ఎటువంటి కమిషన్ లేకుండా వారికి ఇస్తాను అని నమ్మించి కొన్ని రోజుల తరువాత వాళ్ళ క్రెడిట్ కార్డ్ బిల్లులు కూడా తానే కట్టేవాడు. ఒక సంవత్సరంనర పాటు వారికి నమ్మకంగా ఉంటూ వారి క్రెడిట్ కార్డ్ బిల్లులు కట్టుతు  మరియు  క్రెడిట్ కార్డులు స్వైప్ చేస్తూ ఆలా బాధితుల డబ్బుల నుండి తన యొక్క క్రాప్ లోన్, తన అప్పులు కట్టి మరియు తన కుటుంబ సబ్యులకు కూడా డబ్బులు అడ్జస్ట్మెంట్ చేస్తూ కస్టమర్ల క్రెడిట్ కార్డుల నుండి సుమారుగా 28 లక్షల రుపాయలు వాడుకున్నాడు. కస్టమర్లు తరుచు ఫోన్ చేయడంతో వారికి రేపు మాపు అంటూ దాటవేస్తూ వచ్చాడు. ఆ తరువాత తనవల్ల కాకపోవడంతో కొన్ని రోజులు ఎటైన వెళ్లిపొతే కస్టమర్లు మరచిపోతారు అనుకోని తను వేసుకున్న పథకం ప్రకారం తన షాప్ క్లోసే చేసి వెళ్లి ఇన్ని రోజులు విజయవాడలో ఉన్నాడు. ఈ రోజు తన షాప్ వద్దకు వచ్చి, షాప్ ఖాళీ చేస్తుండగ పోలీసులు నిందితుడి పట్టుకోని అదుపులోకి తీసుకోని, విచారించగా నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. నిందితులను పట్టుకొవడంలో ప్రతిభ కనబరిచిన హన్మకొండ పోలీస్‌ మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని ఏసిపి అభినందించారు.
Views: 41

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు వ్యవసాయంలో డ్రోన్లు - టమాటా గ్రాఫ్టింగ్ పై అవగాహన సదస్సు
గజ్వేల్ (సిద్దిపేట జిల్లా) :  శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చరల్ విశ్వవిద్యాలయం, ములుగు, సిద్ధిపేటలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్ ఆధ్వర్యంలో, పుష్కల్...
సింగరేణిలో హౌసింగ్ పీడీ పర్యటన
అతిథి అధ్యాపకుల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
వర్షానికి రోడ్డుపైకి వచ్చిన కొండచిలువ.
కొండగట్టులో గిరి ప్రదక్షిణ ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
ఆటో డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలి
జలసిరి ఫామ్ పౌండ్లు, వ్యక్తిగత సోక్ పిట్స్ అమలుపై రాష్ట్రస్థాయి ఆన్‌లైన్ శిక్షణ