ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు

*50 ఏళ్లకు పైగా కొనసాగుతున్న సంప్రదాయం ప్రకారం ప్రత్యేక పూజలు *రామబాణంతో రావణ దహనం నిర్వహించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ 

ఆదిలాబాద్ జిల్లాలో ఘనంగా విజయదశమి వేడుకలు

ఆదిలాబాద్ : ఆదిలాబాద్ పట్టణంలో విజయదశమి వేడుకలను సంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. పట్టణంలో 50 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఆనవాయితీ ప్రకారం జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ , ఆదిలాబాద్ ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠాధిపతి యోగానంద సరస్వతి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు కలిసి స్థానిక కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం దస్నాపూర్‌లో నిర్వహించిన రావణ దహన కార్యక్రమానికి హాజరయ్యారు.దస్నాపూర్‌లో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ విజయానికి ప్రతీకగా భావించే శమీ వృక్షానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయంలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా పట్టా పాస్ పుస్తకాలను, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆయుధాన్ని చేత పట్టి, పూజలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ప్రజాప్రతినిధులు, అధికారులు, మఠాధిపతి యోగానంద సరస్వతి సమక్షంలో షమీ చెట్టు పూజా కార్యక్రమాలు నిర్వహించి జ్యోతి ప్రజ్వలన చేశారు.అనంతరం చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  రామబాణంతో రావణుడి బొమ్మను వెలిగించి రావణ దహన కార్యక్రమాన్ని పూర్తి చేశారు.ఈ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఆధ్యాత్మిక ప్రముఖులు, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  జిల్లా ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

Views: 2

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: