చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..

- ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి.  - పలువురు ముఖ్య నేతలు.

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..

ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని ప్రజలంతా అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మంగళవారం ఊరుకొండ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలంతా నూతన వస్త్రాలు ధరించి అత్యంత భక్తి శ్రద్ధలతో పండగను జరుపుకున్నారు. ఆ దుర్గామాత ఆశీస్సులతో రైతాంగం, పేద ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయి సుఖసంతోషాలు, విజయాలు వెల్లివిరియాలని పలువురు నేతలు మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. సాయంత్రం వేళ పది గ్రామంలో తూర్పు దిశగా ఏర్పాటుచేసిన జమ్మి చెట్టు వద్దకు వెళ్లి ప్రధాన అర్చకుల మంత్రోత్సరనల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించి జమ్మి ఆకును తమ తోటి వారికి, పెద్దలకు, తల్లిదండ్రులకు, మిత్రులకు శ్రేయోభిలాషులకు అందజేసి అలాయ్ బలాయ్ చేసుకొని విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు యువజన విభాగం నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Views: 50

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: