విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

అమరవీరుల స్ఫూర్తితో ప్రజల భద్రతకు కృషి జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే లింగంపేట అమరవీరుల స్తూపం వద్ద పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం.. 154 మంది అమర పోలీసులకు ఘన నివాళులు

విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం

రాజన్న సిరిసిల్ల జిల్లా,శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం త్యాగం చేసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా చందుర్తి మండలం లింగంపేట గ్రామ శివారులోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని అమరులకు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు.ఈ సందర్భంగా సాయుధ పోలీసులు శోక్ శస్త్ర్ నిర్వహించగా, పోలీస్ అధికారులు, సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు రెండు నిమిషాలు మౌనం పాటించారు. గత ఏడాది నుంచి ఇప్పటివరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన 154 మంది పోలీస్ అమరవీరుల పేర్లను చదివి వినిపించారు.అమరుల త్యాగాలతోనే మెరుగైన భద్రతఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విధి నిర్వహణలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూ ప్రజల రక్షణ కోసం ప్రాణత్యాగం చేసిన పోలీసుల సేవలు చిరస్మరణీయమని అన్నారు. అమరవీరులు ప్రజల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతారని పేర్కొన్నారు. జిల్లాలో అంతర్గత భద్రత విధుల్లో ఎనిమిది మందికి పైగా పోలీసులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాల ఫలితంగా ప్రస్తుతం పరిస్థితులు గతంతో పోలిస్తే మెరుగుపడ్డాయని తెలిపారు.అమరవీరుల త్యాగాలను స్మరించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని, వారి స్ఫూర్తితో పోలీస్ శాఖ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తోందని వివరించారు.అక్టోబర్ 21నే ఎందుకు?1959 అక్టోబర్ 21న లడఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు సిబ్బంది త్యాగాలకు గుర్తుగా ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.అమరవీరుల కుటుంబాలకు భరోసాకార్యక్రమానికి హాజరైన అమరవీరుల కుటుంబ సభ్యులతో ఎస్పీ ప్రత్యేకంగా మాట్లాడి వారి కుటుంబ పరిస్థితులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారు తెలిపిన సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.అనంతరం కుటుంబ సభ్యులకు జ్ఞాపికలను అందజేశారు.అక్టోబర్ 31 వరకు ప్రత్యేక కార్యక్రమాలుపోలీస్ అమరవీరుల సేవలు, త్యాగాలను ప్రజలకు గుర్తుచేసేలా అక్టోబర్ 31 వరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు, సైకిల్ ర్యాలీ, క్యాండిల్ ర్యాలీ, రన్, ఓపెన్ హౌస్, వ్యాసరచన పోటీలు, ఫొటో, వీడియో పోటీలు నిర్వహించనున్నట్లు ఎస్పీ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో డీఎస్పీలు నాగేంద్రచారి, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సీఐలు, ఆర్‌ఐలు, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది, అమరవీరుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Views: 7

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: