మల్లన్న సన్నిధిలో స్వామి వారికి రుద్రాభిషేకం
కొమురవెల్లి,(సిద్దిపేట):కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో నిర్వహించినటువంటి శ్రీ దేవి త్రిరాత్రి మహోత్సవాలలో భాగంగా ఈరోజు ,ఉదయం క్షేత్రపాల భైరవార్చన శ్రీ స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించిన తర్వాత శ్రీ అమ్మవారిని అర్చకులు అందరూశాస్త్రీయంగా శ్రీ స్వామివారి పుష్కరిణి కోనేరు వద్దకు తీసుకువెళ్లి అక్కడ అమ్మవారికి పంచామృతాభిషేకము సుగంధద్రవ్యాభిషేకం ప్రధాన కలశాభిషేకం, అర్చన నీరాజన,మంత్రపుష్పాదులు సమర్పించి అస్త్ర రాజార్చనం చేసి శ్రీదేవి మూర్తి సహితంగా త్రిశూల స్నానం ఆచరించారు అనంతరం వెండి కుంభంలో శ్రీ స్వామివారి పుష్కరిణీ జలాలను తీసుకుని వచ్చే స్వామివారి గర్భాలయంలో రుద్రాభిషేకం అష్టోత్తర శతనామార్చన, మహా మంగళ హారతి మంత్రపుష్ప సమర్పణ సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది,అర్చకులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


