2028 నాటికి పోలీసు శాఖలో అన్ని ఖాళీలు భర్తీ
సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన.. 4,773 కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్
హైదరాబాద్: తెలంగాణ పోలీసు శాఖలోని అన్ని ఖాళీలను 2028 నాటికి భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. గోషామహల్‌లో నిర్వహించిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన ప్రసంగించారు. పోలీసు నియామకాలు, సిబ్బంది సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.ఇప్పటికే 112 మంది డీఎస్పీలను నియమించినట్లు సీఎం వెల్లడించారు. తాజాగా 7,437 పోస్టులకు అనుమతులు మంజూరు చేశామని, ఇందులో 4,773 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు. మిగిలిన ఖాళీలను కూడా 2028 నాటికి భర్తీ చేస్తామని స్పష్టం చేశారు.పోలీసుల సంక్షేమంలో భాగంగా వారి పిల్లల కోసం పోలీస్ స్కూల్‌ను ఏర్పాటు చేసినట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. పోలీసు సిబ్బంది సేవలను, త్యాగాలను ప్రభుత్వం గుర్తిస్తుందని పేర్కొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


