రావణ దాన కార్యక్రమాన్ని వీక్షించిన పోచారం కుటుంబ సభ్యులు......
విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన పోచారం...... పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యంలో వరుసగా 16వసారి రావణ దహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది...... రావణ దహన కార్యక్రమాన్ని వీక్షించిన పరిసర ప్రాంతాల ప్రజలు......
బాన్సువాడ :బాన్సువాడ లో ఘనం గా రావణ దహన కార్యక్రమం మంగళవారం రాత్రి కుటుంబ సభ్యుల తో కలిసి వీక్షించి న పోచారం శ్రీనివాసరెడ్డి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని బాన్సువాడ పట్టణం లోని ప్రొఫెసర్ జయశంకర్ మినీ స్టేడియంలో నిర్వహించిన రావణదహన కార్యక్రమాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యుల తో కలిసి వీక్షించారు. మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఆధ్వర్యం లో వరుస గా 16వ సంవత్సరం నిర్వహించిన ఈ రావణదహన కార్యక్రమాని కి బాన్సువాడ పట్టణం తో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్య లో హాజరయ్యారు. రావణ దహనం తో మినీ స్టేడియం పండుగ సందడి తో కళకళలాడింది. అనంతరం బాన్సువాడ గ్రామీణ మండలంలోని తన స్వగ్రామ మైన పోచారం గ్రామం లో హనుమాన్ మందిరం వద్ద జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం శ్రీనివాసరెడ్డి, గ్రామస్థుల కు జమ్మి ఆకుల ను పంపిణీ చేస్తూ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ అగ్రో చైర్మన్ కాసుల బాలరాజ్, పోచారం సురేందర్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ కాసుల విజయ, నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


