మద్దూరు గ్రామ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపిన కప్పెర రమేష్
షాబాద్,(రంగారెడ్డి): షాబాద్ మండలంలోని మద్దూరు గ్రామ ప్రజలకు దసరా పండుగ సందర్భంగా ఐదవ వార్డు సభ్యులు కప్పెర రమేష్ శుభాకాంక్షలు తెలిపారు. విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు నింపాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో 7వ వార్డు మెంబర్ కడమంచి శ్రీనివాస్‌తో పాటు బేడా బుడగ జంగం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాగుల మల్లేష్, నాగుల అంజయ్య, కడమంచి మల్లేష్, గగనం గోపాల్, మోతె ముత్తయ్య, నాగుల జంగయ్య, నాగుల సన్నీ, కడమంచి లక్ష్మణ్, తూర్పటి నందు, మోతె నర్సింహ, కప్పెర దేవానంద్, కడమంచి రాములు, నాగుల దినకర్, నాగుల రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.గ్రామ ప్రజలందరూ దసరా పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రతి ఇంటా సుఖశాంతులు వెల్లివిరియాలని వారు ఆకాంక్షించారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


