మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్‌–1

అమ్మకాల్లో కర్ణాటక టాప్‌.. మద్యంపై ఆదాయ ఆధారపడటం ఆందోళనకరం రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో 32 శాతం మద్యం నుంచే ఎం సి పి ఐ సి సిద్దిపేట జిల్లా కార్యదర్శి ఎడబోయిన శ్రీనివాస్ రెడ్డి

మద్యం పన్నుల ఆదాయంలో తెలంగాణ నంబర్‌–1

అక్కన్నపేట :మద్యం అమ్మకాల్లో కర్ణాటక రాష్ట్రం ముందంజలో ఉండగా, మద్యంపై పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడం ఆందోళనకరమని ఎం.సీపీఐ(సి) సిద్దిపేట జిల్లా కార్యదర్శి అడబోయిన శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయంలో మద్యం వాటా 32 శాతానికి చేరడం ప్రభుత్వ ఆదాయ సమీకరణలో మద్యం ఎంత కీలకంగా మారిందో తెలియజేస్తోందని అన్నారు.ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎస్‌డబ్ల్యూఏఐ) నివేదిక ప్రకారం, 2025 ఆర్థిక సంవత్సరంలో దేశవ్యాప్తంగా మద్యం పరిశ్రమ ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కలిపి సుమారు రూ.4 లక్షల కోట్ల పన్నుల ఆదాయం సమకూరినట్లు వెల్లడైందన్నారు. రాష్ట్రాల సొంత పన్నుల ఆదాయంలో మద్యం వాటా జాతీయ సగటున 19.1 శాతంగా ఉండగా, తెలంగాణలో 32 శాతానికి చేరడం గమనార్హమని పేర్కొన్నారు.మద్యం విక్రయాల్లో కర్ణాటక 6.88 కోట్ల కేసులతో మొదటి స్థానంలో, తమిళనాడు రెండో స్థానంలో ఉండగా, తెలంగాణ 3.71 కోట్ల కేసులతో మూడో స్థానంలో నిలిచిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ 3.55 కోట్ల కేసులతో నాలుగో స్థానంలో ఉందన్నారు. మద్యం పరిశ్రమ దేశ ఆర్థిక వ్యవస్థకు భారీగా పన్నుల ఆదాయాన్ని సమకూరుస్తున్నప్పటికీ, ప్రజల ఆరోగ్యం, కుటుంబాల ఆర్థిక పరిస్థితులపై మద్యపానం ప్రభావాన్ని కూడా ప్రభుత్వాలు పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.ప్రభుత్వాలు మద్యంపై వచ్చే ఆదాయంపైనే అధికంగా ఆధారపడకుండా, ఇతర రంగాల అభివృద్ధి ద్వారా ప్రత్యామ్నాయ ఆదాయ వనరులను బలోపేతం చేయాలని అడబోయిన శ్రీనివాస్ రెడ్డి కోరారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ మద్యపాన నియంత్రణపై అవగాహన కార్యక్రమాలను విస్తృతం చేయాలని, ప్రభుత్వ ఆదాయ విధానాల్లో ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేయాలని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎం.సీపీఐ(యు) సిద్దిపేట జిల్లా కార్యదర్శిఅడబోయిన శ్రీనివాస్ రెడ్డి

Views: 61

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: