మినీ ట్యాంక్ వద్ద ఆత్మీయ పలకరింపు.. పార్టీలు వేరైనా పండగలో ఒక్కటైన నేతలు!
నాగర్ కర్నూల్నాగర్: కర్నూల్ జిల్లా కేంద్రంలోని మినీ ట్యాంక్ వద్ద నిర్వహించిన దసరా ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా దసరా వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా వేదిక వద్ద ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే డాక్టర్ కూచుకుళ్ల రాజేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు దిలీప్ ఆచారి ఈ వేడుకలో పాల్గొన్నారు. రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉన్నప్పటికీ, పండగ వేళ ఆత్మీయంగా పలకరించుకుని, ఒకరికొకరు దసరా శుభాకాంక్షలు తెలుపుకున్నారు. రాజకీయాలకు అతీతంగా వారి కలయిక అక్కడున్న ప్రజలను ఆకట్టుకుంది. మినీ ట్యాంక్ వద్ద ప్రజలతో కలిసి ఉత్సవాల్లో పాల్గొన్న నేతలు, చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ఆత్మీయంగా మాట్లాడారు. పార్టీలు వేరైనా, సిద్ధాంతాలు వేరైనా.. పండగ సమయంలో ఇలా ప్రజా ప్రతినిధులందరూ కలిసిమెలిసి ఉండడం నిజంగా అభినందనీయమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఇలాంటి కలుపుగోలుతనం వల్లనే రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని, రాజకీయ నాయకులు ఎల్లప్పుడూ ఇలాగే ఐక్యంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


