బ‌తుక‌మ్మ వేడుక‌ల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తుల సంద‌డి .....

"బేల మండ‌లం మ‌సాల గ్రామంలో సంబ‌రాల‌కు హాజ‌రు.... బ‌తుక‌మ్మ‌ల చుట్టూ ఆడి పాడిన కంది శ్రీ‌నివాస రెడ్డి , కంది మౌనా శ్రీ‌నివాస రెడ్డి  ప‌లువురికి న‌గ‌దు బ‌హుమ‌తులు అందించి ప్రోత్స‌హించిన కంది  దంప‌తులు

బ‌తుక‌మ్మ వేడుక‌ల‌లో కంది శ్రీ‌నివాస రెడ్డి దంప‌తుల సంద‌డి .....

ఆదిలాబాద్  బ్యూరో అక్టోబర్ 21 (విజన్ ఆంధ్ర)అదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జ్ కంది శ్రీనివాస రెడ్డి  తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి ,కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బేల మండలంలో పర్యటించారు . మండలంలోని భవానిగూడ అమ్మ‌వారి ఆల‌యంలో  కంది శ్రీనివాస రెడ్డి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. అనంత‌రం మ‌సాల (బి) గ్రామంలో జ‌రిగిన బ‌తుక‌మ్మ వేడుక‌ల‌కు హాజ‌ర‌య్యారు. ప‌లు గ్రామాల నుండి బ‌తుక‌మ్మ‌ల‌తో త‌ర‌లివ‌చ్చిన మ‌హిళ‌ల‌తో క‌లిసి బ‌తుక‌మ్మ సంబ‌రాల‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు ఆక‌ట్టుకున్నాయి. మ‌సాల గ్రామంలో వంద‌లాది బ‌తుక‌మ్మ‌ల చుట్టూ మ‌హిళ‌ల‌తో క‌లిసి కంది శ్రీ‌నివాస రెడ్డి దంపతులు బ‌తుక‌మ్మ పాట‌ల‌కు ఉత్సాహంగా నృత్యాలు చేసారు.  అనంత‌రం ప‌లువురిని న‌గ‌దు బ‌హుమ‌తుల‌తో ప్రోత్ప‌హించారు.  పూల‌ను పూజించే సంస్కృతి బ‌తుక‌మ్మ పండ‌గ  అని కంది శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. అంద‌రికి బ‌తుక‌మ్మ ద‌స‌రా ముంద‌స్తు దీపావ‌ళి శుభాకాంక్ష‌లు తెలిపారు. మ‌సాల గ్రామంలో జ‌రిగే బ‌తుక‌మ్మ 
వేడుక‌ల‌కు  మూడోసారి హాజ‌ర‌వ‌డం సంతోషంగా ఉంద‌న్నారు. ఇక్క‌డి ప్ర‌జ‌ల ప్రేమ ఎంతో గొప్ప‌ద‌న్నారు. గ్రామంలో ప్ర‌భుత్వం త‌ర‌పున అన్ని అభివృద్ది కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఇంకా మిగిలిన ప‌నుల‌ను కూడా త్వ‌ర‌లో పూర్తి చేసుకుందామ‌న్నారు. ప్ర‌భుత్వం అందించే సంక్షేమ‌ప‌థ‌కాలు ఉచిత క‌రెంట్ , మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్ర‌యాణం, ఇందిర‌మ్మ ఇండ్లు, స‌న్న‌బియ్యం , రైతు భ‌రోసా లాంటి ప‌థ‌కాల‌కు కేంద్రం నుండి స‌హాయం అంద‌కున్నా రేవంత్ రెడ్డి ప్ర‌భుత్వం అందిస్తుంద‌న్నారు. అలాగే త్వ‌ర‌లో ప్ర‌తీ మ‌హిళ‌కు నెల‌కు 2వేల 500 కూడా అంద‌నున్నాయ‌న్నారు. గ‌త‌ బీఆర్ ఎస్ ప్ర‌భుత్వంలో నిధుల దుర్వినియోగం జ‌రిగింద‌ని విమ‌ర్శించారు. కాని కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రజాసంక్షేమం కోసం ప‌ని చేస్తుంద‌న్నారు. మ‌రొక్క‌సారి రాష్ట్రంలో రేవంత‌న్న స‌ర్కార్ ,కేంద్రంలో కూడా కాంగ్రెస్ కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డి రాహుల్ గాంధీ ప్ర‌ధాని కావ‌డం త‌ధ్య‌మ‌న్నారు. అందుకు మీ అందరి ఆశీర్వాదం అవ‌స‌ర‌మ‌న్నారు.వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఆదిలాబాద్ గ‌డ్డ‌పై కాంగ్రెస్ జెండా ఎగుర‌వేద్దామ‌న్నారు.ఎంపీ ఎమ్మెల్యే స్థానాల‌ను గెలిపించి రేవంత‌న్న కు రాహుల్ గాంధీకి కానుక‌గా ఇద్దామ‌న్నారు. అందుకు కాంగ్రెస్ శ్రేణులంద‌రు క‌ష్ట‌ప‌డి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.తాను అమెరికా నుండి వ‌చ్చింది ఆదిలాబాద్ ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికేన‌ని స్ప‌ష్టం చేసారు. తన‌కు  డ‌బ్బు పై ఆశ‌లేద‌ని డ‌బ్బు సంపాద‌న‌కు రాజ‌కీయాల‌లోకి రాలేద‌న్నారు. ఆదిలాబాద్ కు ఎప్పుడొచ్చినా మీ బంధువు కంది శ్రీ‌నివాస రెడ్డి ఉన్నాడ‌న్న విష‌యం మ‌ర‌వ‌వ‌ద్ద‌ని త‌న క్యాంపు కార్యాల‌యానికి వ‌చ్చి బుక్కెడు బువ్వ తిని ఆశీర్వ‌దించాల‌ని కోరారు. త‌న పుట్టినూరు మెట్టినూరు త‌ర్వాత బతుక‌మ్మ వేడుక‌ల‌కు హాజ‌ర‌యింది మ‌సాల గ్రామంలోని వేడుక‌ల‌కే అని కంది మ‌నా శ్రీ‌నివాస రెడ్డి అన్నారు. అమ్మ‌వారి తొమ్మిది రూపాలు మ‌హిళ జీవితంలోని అనేక కోణాల‌ను తెలియ‌ప‌రుచుతాయ‌న్నారు. అమ్మాయిలు బాగాచ‌దివి త‌మ సొంత కాళ్ల‌పై నిల‌బ‌డాల‌ని ఆకాంక్షించారు. త‌ల్లిదండ్రులు త‌మ కుమారుల‌తో స‌మానంగా కూతుళ్ల‌ను కూడా చూసుకోవాల‌ని వారిని అన్ని రంగాల‌లో ప్రోత్స‌హించాల‌ని సూచించారు. అమ్మాయిని ల‌క్ష్మీదేవిగానే కాకుండా అవ‌స‌మ‌యితే కాళికాదేవి గా మార్చాల‌న్నారు. త‌నకు ప్ర‌తీ విష‌యంలో భ‌ర్త కంది శ్రీ‌నివాస రెడ్డి ప్రోత్సాహం దొరుతుందని  మ‌హిళ‌ల ఆలోచ‌న‌ల‌కు గౌర‌వించే అలాంటి వ్య‌క్తికి  భార్యగా ఉండ‌టం త‌న అదృష్ట మ‌న్నారు. చ‌దువుకునే అమ్మాయిల‌కు ఏ అవ‌స‌ర‌మొచ్చినా స‌హాయం చేయ‌డానికి వెనుకాడ‌మ‌న్నారు. స్త్రీలు చ‌దువుకొని ఉద్యోగాలు చేయ‌డ‌మే కాకుండా రాజ‌కీయాల‌లో కూడా రాణించాల‌ని ఆకాంక్షించారు. భ‌విష్య‌త్తులో జ‌రిగే ఎన్నిక‌లేవైనా కాంగ్రెస్ పార్టీ చే గెలిపించాల‌ని కోరారు . ఈ కార్య‌క్ర‌మంలో బేల మండ‌ల కాంగ్రెస్ నాయ‌కులు ప‌లు గ్రామాల స‌ర్పంచులు , ఉప స‌ర్పంచులు, కార్య‌క‌ర్త‌లు అభిమానులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Views: 11

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: