​కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

​కొండగట్టు అంజన్న సేవలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

మల్యాల, అక్టోబర్ :విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం బుధవారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.​ఆలయానికి విచ్చేసిన ప్రజాప్రతినిధులకు ఆలయ అధికారులు (ఈవో), అర్చకులు, వేద పండితులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి సన్నిధిలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రం కప్పి, తీర్థప్రసాదాలను అందజేశారు.​ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గ, రాష్ట్ర ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. స్వామివారి కృపాకటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు ఆకాంక్షించారు.​ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బత్తిని శ్రీనివాస్ గౌడ్, కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ యువజన సంఘం అధ్యక్షులు ముత్యం శంకర్ గౌడ్,   సర్వాపూర్ సర్పంచ్ జంగిల్ హనుమంతు, ఉప సర్పంచ్ కందరి ముత్యంరెడ్డి, గుడి పేట సర్పంచ్ శ్వేతా అంజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు మ్యాక లక్ష్మణ్, సొంత ప్రకాష్ రెడ్డి, ఆలయ సిబ్బంది తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Views: 25

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: