పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

 వధి నిర్వహణలో అసువులు బాసిన ప్రతి ఒక్క పోలీసు కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి - జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  ఏ ఆర్ హెడ్ క్వార్టర్స్ నందు ఫ్లాగ్ డే  ప్రస్తుత జిల్లా ప్రశాంత వాతావరణానికి కారణం ఒకప్పటి అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే

పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం - జిల్లా కలెక్టర్ రాజర్షి షా 

ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 21 (విజన్ ఆంధ్ర)శాంతి భద్రతల పరిరక్షణ మరియు దేశ సరిహద్దు రక్షణ కోసం విది నిర్వహణలో అసువులు బాసిన పోలీసు ఫ్లాగ్ డే (అమరవీరుల సంస్మరణ దినోత్సవం) బుధవారం జిల్లాలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్ లో గల అమరవీరుల స్తూపం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు, కలెక్టర్ రాజర్షి షా, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్, ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్, న్యాయమూర్తి హుస్సేన్ నాయక్, అదనపు ఎస్పీ పి మౌనిక, ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే, మున్సిపల్ చైర్మన్ బండారి అనూష, ఇతర శాఖల ఉన్నతాధికారులు పోలీసు ఉన్నతాధికారులు ముఖ్యంగా అమరవీరుల కుటుంబ సభ్యులతో కలిసి పుష్పగుచ్చాలతో స్తూపం వద్ద నివాళులర్పించడం జరిగింది.  జిల్లా పోలీసు యంత్రాంగం పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం ఫ్లాగ్ డే సందర్భంగా భారీ ఏర్పాట్ల మధ్య అమరవీరులను మనస్ఫూర్తిగా స్మరించుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా ఈ సంవత్సరం, దేశ రక్షణలో మరియు విధి నిర్వహణలో అసువులు బాసిన 154 మంది పోలీసు సిబ్బంది, అధికారుల పేర్లను అదనపు ఎస్పీ పరిపాలన పి మౌనిక  చదువుతూ స్మరించుకోవడం జరిగింది. మొదటగా అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ పుష్పగుచ్చాలతో కలిసి స్తూపం వద్ద, అమర జ్యోతి వెలిగించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం సాయుధ పోలీసులు అమరవీరులకు సలామి శస్త్ర ద్వారా గౌరవ వందనాన్ని సమర్పించి, ఆయుధాలను తలకిందులుగా చేసి *శోక్ శస్త్ర* శ్రద్ధాంజలి ఘటించి, ద్వారా రెండు నిమిషాలు మౌనం పాటించి అమరవీరులను స్మరించుకున్నారు. తదుపరి అమరవీరుల కుటుంబ సభ్యులతో మాట్లాడి ఎలాంటి సమస్యలనైనా పరిష్కరించే దిశగా జిల్లా పరిపాలన మరియు పోలీసు యంత్రాంగం పూర్తి సహాయ సహకారాలు అందిస్తాందని హామీ ఇచ్చారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ తమ కుటుంబ సభ్యులను సైతం లెక్కచేయకుండా విధి నిర్వహణలో ఒక పోలీసు వ్యవస్థనే ఇతరుల కోసం ప్రాణాలను సైతం అర్పిస్తుందని తెలియజేశారు. పోలీసులు నిస్వార్ధమైన సేవలను అందిస్తారని వారికి ప్రతి ఒక్కరూ సహకరిస్తూ నేర నియంత్రణలో తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. ప్రతి సంవత్సరం అమరవీరులను స్మరించుకుంటూ వారికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేయాలని వారి కుటుంబ సభ్యులను సమాజంలో ఉన్నత స్థానాలకు ఎదిగేలా కృషి చేయాలని తెలియజేశారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలైన అందిస్తామని హామీ ఇచ్చారు. విధి నిర్వహణలో పోలీసులు చేసిన త్యాగాలను నిరంతరం స్మరించుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్  మాట్లాడుతూ అక్టోబర్ 21న ప్రతి సంవత్సరం జరుపుకునే అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే) 66 సంవత్సరాల క్రితం లడక్ సమీపంలో భారత సరిహద్దుల్లో పహారకాస్తున్న మన పోలీసు సిబ్బందిపై చైనీయులు దాడి చేశారని, ఈ ప్రదేశాన్ని హార్ట్ స్ప్రింగ్ గా పేర్కొంటారని,1959 అక్టోబర్ 21న ఆ సమయంలో విది నిర్వహణలో వీరోచితంగా పోరాడి అసువులు బాసిన పదిమంది సిఆర్పిఎఫ్ జవాన్ల వీరమరణం సందర్భంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ప్రతి సంవత్సరంఅక్టోబర్ 21న దేశవ్యాప్తంగా ఫ్లాగ్ డే దినోత్సవాన్ని అమరవీరుల ను స్మరించుకుంటూ నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. వారి సంస్మరణ ఆదిలాబాద్ జిల్లా నందు పది రోజులపాటు, ప్రజా హిత కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా నార్త్ తెలంగాణ లోని ఆదిలాబాద్ జిల్లాలో పోలీసులు సంఘవిద్రోహశక్తులతో పోరాడి చిరస్మరణీయులైన విషయం గుర్తు చేశారు. ప్రస్తుత ఆదిలాబాద్ జిల్లా ప్రశాంత వాతావరణం లో కొనసాగడానికి అసువులు బాసిన ప్రతి ఒక్క అమరవీరుల కుటుంబ సభ్యులకు చేతులెత్తి దండం పెడుతూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నందు 50 మంది పోలీసు అధికారులు సిబ్బంది సంఘవిద్రోహశక్తులతో ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేస్తూ ఎలాంటి అవసరాలైన జిల్లా పోలీసు యంత్రాంగాన్ని సంప్రదించాలని సూచించారు. ప్రస్తుత సమాజం డ్రగ్స్ కు వ్యతిరేకంగా పోరాడుతుందని, దేశంలోనే తెలంగాణ పోలీసు శాఖ అన్ని రంగాల్లో ముందుంటూ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు రెండవ బెటాలియన్ కమాండెంట్ బి వెంకటేశ్వర రెడ్డి, డీఎస్పీలు ఎల్ జీవన్ రెడ్డి, కమతం ఇంద్ర వర్ధన్, ఆదిలాబాద్ జిల్లా సర్కిల్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్లు, రెండవ బెటాలియన్ అధికారులు, ఇతర శాఖల ఉన్నతాధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Views: 6

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి.. చెడుపై మంచి సాధించిన విజయమే విజయదశమి..
ఊరుకొండ : నాటినుండి నేటి వరకు నీతి నిజాయితీ, న్యాయం ధర్మం ఎన్నటికైనా విజయాన్ని సాధిస్తాయని గుర్తుచేసే.. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా విజయదశమి పర్వదినాన్ని...
విధి నిర్వహణలో పోలీసుల త్యాగాలు చిరస్మరణీయం
పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి
పోలీసు అమరవీరుల త్యాగం మరువలేనిది
నేడు పత్తి కొనుగోళ్లు ప్రారంభం... కలెక్టర్ రాజర్షి షా 
పుల్లారెడ్డి స్వీట్ హౌస్ అధినేత మృతదేహానికి నివాళులర్పించిన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
నల్లగొండలో ఘనంగా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం: