కంది శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో ఆయుధ పూజ
ఆదిలాబాద్ బ్యూరో అక్టోబర్ 21(విజన్ ఆంధ్ర)ఆదిలాబాద్ పట్టణంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇంచార్జి కంది శ్రీనివాస రెడ్డి క్యాంపుs కార్యాలయంలో వేడుకలు అంబరాన్నంటాయి. కంది శ్రీనివాస రెడ్డి తన సతీమణి కంది మౌనా శ్రీనివాస రెడ్డి కూతురు అరికా రెడ్డి కుమారుడు ఇషాన్ రెడ్డి లతో కలిసి వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఆయుధ పూజ నిర్వహించారు. ప్రజలందరికి దంపతులు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రలందరూ ఆయురారోగ్యాలు సుఖసంతోషాలు సిరిసంపదలతో ఉండాలని అమ్మవారిని ప్రార్ధించినట్టు తెలిపారు. దుర్గమ్మ ఆశీస్సులు అందరిపై ఉండాలని కోరుకున్నారు.అనంతరం క్యాంపు కార్యాలయ ఆవరణలో విద్యానగర్ గ్యారేజీలోని వాహనాలకు శాస్త్రోక్తంగా పూజలు చేసారు. అందరికి అమ్మవారి తీర్ధ ప్రసాదాలు అందచేసారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


