రాయపర్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలి

జాతీయ రహదారిపై బైఠాయించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి , బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు నమోదు ప్రక్రియపై సమీక్ష

రాయపర్తి మండలాన్ని  కరువు మండలంగా ప్రకటించాలి

రాయపర్తి : వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.గురువారం రాయపర్తి మండల కేంద్రంలో ఆయన విస్తృతంగా పర్యటించారు.ఎర్రబెల్లితో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి ఉన్నారు.వరంగల్ -ఖమ్మం జాతీయ రహదారిపై బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు,స్థానిక నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు.రహదారిపై బైఠాయించి కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.దింతో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించిపోయాయి.ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ... వరంగల్ జిల్లాలోని వేలాది ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతాంగం తీవ్ర నిరాశలో కూరుకుపోయిందని మండిపడ్డారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి రాయపర్తి మండలంతో పాటు వరంగల్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, నష్టపోయిన అన్నదాతలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో ప్రభుత్వంపై పోరాటాని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

 ఎమ్మెల్సీ ఓటు నమోదుపై సమీక్ష..

బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నాయకులు,కార్యకర్తల సమీక్షా సమావేశంలో ఎర్రబెల్లితో కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడారు.గ్రాడ్యుయేట్ ఓటర్ల నమోదును పక్కా ప్రణాళికతో పూర్తిచేయాలని అన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరి చేత ఓటు నమోదు చేయించే బాధ్యతను నాయకులు తీసుకోవాలని కోరారు.కాంగ్రెస్ పాలనలలో నిరుద్యోగులకు జరిగిన అన్యాయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.అర్హులైన ప్రతి గ్రాడ్యుయేట్ నవంబర్ 6వ తేదీ లోగా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సూచించారు.అనంతరం మండల నాయకులు తహసిల్దారు ముల్కనూరి శ్రీనివాస్ కు రాయపర్తిని కరువు మండలంగా ప్రకటించాలని వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల నాయకులు,కార్యకర్తలు,సర్పంచులు,రైతులు  పాల్గొన్నారు.

Views: 8

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్