ఫోక్సో చట్టంపై అవగాహన
లక్షెట్టిపేట : బాలలపై లైంగిక వేధింపులను అరికట్టడంతోపాటు, వారి హక్కులను పరిరక్షించేందుకు పోక్సో చట్టంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని మండల న్యాయ సేవల కమిటీ చైర్మన్ బి. కృష్ణ తేజ అన్నారు. గురువారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా పోక్సో చట్టంలోని ముఖ్యమైన అంశాలు, బాలలపై లైంగిక నేరాలకు సంబంధించిన చట్టపరమైన చర్యలు, బాధితులకు అందించే న్యాయ సహాయం గురించి వివరించారు. విద్యార్థులు వేధింపులకు గురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా సంబంధిత అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ జి. పద్మ, సీనియర్ న్యాయవాది జి. కిరణ్ కుమార్, ప్యానెల్ న్యాయవాది ఎన్. రవీందర్, పాఠశాల ఇన్‌చార్జి హెచ్‌ఎం సిహెచ్ . సుజాత పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


