మనోహరాబాద్ రైతు వేదికలో పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమం
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించిన అధికారులు, బీజేపీ నాయకులు, రైతులు
మనోహరాబాద్ : రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో భాగంగా 24వ విడత నిధులను శుక్రవారం ప్రధానమంత్రి విడుదల చేసిన సందర్భంగా మనోహరాబాద్ రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక వీక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యక్షంగా వీక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగాన్ని, పీఎం కిసాన్ నిధుల విడుదల కార్యక్రమాన్ని అధికారులు, రైతులు ఆసక్తిగా వీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా అర్హులైన రైతులకు ఆర్థిక సహాయం అందిస్తోందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. వ్యవసాయ పెట్టుబడుల అవసరాలకు ఈ పథకం రైతులకు కొంతమేర ఆర్థిక తోడ్పాటును అందిస్తోందని తెలిపారు.రైతులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వ్యవసాయ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన వివరాలు, అర్హతలు, నిధుల జమకు సంబంధించిన సందేహాలు ఉంటే వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని సూచించారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి మల్లేశం, మండల వ్యవసాయ విస్తరణ అధికారులు నరేందర్, వినోద్ కుమార్, పలువురు రైతులు పాల్గొన్నారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.


