వ్యక్తిగత పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి
పశువులకు నాణ్యమైన పచ్చిమేత.. పశుపోషకులకు ఆర్థిక ప్రయోజనం , జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి
సంగారెడ్డి : పశువులకు ఏడాది పొడవునా నాణ్యమైన పచ్చిమేత అందుబాటులో ఉంచడంతో పాటు పశుపోషకులకు ఆర్థికంగా ప్రయోజనం చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం వ్యక్తిగత పశుగ్రాస అభివృద్ధి కార్యక్రమం అమలు చేస్తోందని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి తెలిపారు.
ఈ కార్యక్రమం ద్వారా అర్హులైన రైతులు తమ భూముల్లో పశుగ్రాస పంటలను సాగు చేసుకుని పశువులకు అవసరమైన మేతను సొంతంగా సమకూర్చుకోవచ్చని పేర్కొన్నారు. పశువులకు సమతుల్యమైన పోషకాహారం అందించడం ద్వారా వాటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు పాల ఉత్పత్తిని పెంచుకునే అవకాశం ఉంటుందని తెలిపారు.
పశుగ్రాసాన్ని సొంతంగా సాగు చేసుకోవడం వల్ల బయట నుంచి మేత కొనుగోలు చేయాల్సిన అవసరం తగ్గి, పశుపోషణ ఖర్చులను నియంత్రించు
కోవచ్చని వివరించారు. తద్వారా రైతులకు అదనపు ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమం కింద పశుగ్రాస సాగుకు అనువైన భూమి, అవసరమైన నీటి వసతి కలిగిన రైతులు అర్హత ప్రమాణాలకు అనుగుణంగా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు.
పశుగ్రాస సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు సామగ్రికి సంబంధించి
వీబి జీ రామ్ జీ,
ప్ర భుత్వ మార్గదర్శకాల ప్రకారం సహాయం అందించే అవకాశం ఉంటుంది.
రైతులు తమ భూమి స్వభావం, నీటి లభ్యతకు అనుగుణంగా అనువైన పశుగ్రాస పంటలను సాగు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమానికి సంబంధించిన అర్హతలు, దరఖాస్తు విధానం, ప్రభుత్వ సబ్సిడీ వివరాల కోసం సమీపంలోని పశువైద్యశాల లేదా సంబంధిత పశుసంవర్ధక శాఖ అధికారులను సంప్రదించాలని జిల్లా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ వసంతకుమారి కోరారు.
About The Author
నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Related Posts

