ఢిల్లీ పోరుకు పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు

నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో భారీ ధర్నా, ధర్నాకు బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సును ప్రారంభించిన కాట దంపతులు

ఢిల్లీ పోరుకు పటాన్‌చెరు కాంగ్రెస్ శ్రేణులు

పటాన్‌చెరు : సంగారెడ్డి  జిల్లా ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ విలువల సంరక్షణ లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ చేపట్టిన పోరాటంలో భాగస్వాములయ్యేందుకు పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ శ్రేణులు ఢిల్లీకి బయలుదేరాయి. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ ఏకపక్ష నిర్ణయాలను నిరసిస్తూ నవంబర్ 1న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించనున్న భారీ ధర్నాలో పాల్గొనేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లారు.

ఈ సందర్భంగా ఢిల్లీకి బయలుదేరిన కాంగ్రెస్ శ్రేణుల బస్సును పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి కాట శ్రీనివాస్ గౌడ్, ఆయన సతీమణి, సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కాట సుధారాణి జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడం, రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలకు విఘాతం కలిగించే నిర్ణయాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న పోరాటంలో నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.

Views: 22

About The Author

Vision Andhra Telugu Daily Picture

 నిజాయితీ, నిష్పాక్షికత, విశ్వసనీయత అనే మూడు విలువలను ఆధారంగా చేసుకుని పనిచేస్తున్న  వార్తా సంస్థ. సమాజంలో జరుగుతున్న ప్రతి ముఖ్యమైన పరిణామాన్ని వేగంగా, ఖచ్చితంగా, బాధ్యతాయుతంగా పాఠకులకు అందించడం మా ప్రధాన లక్ష్యం.

Tags:
Error on ReusableComponentWidget

Latest News

రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ. రైతులకు ప్రధానమంత్రి కిసాన్ నిధులను విడుదల చేసిన మోడీ.
  బాన్సువాడ :  ప్రధానమంత్రి కిసాన్ నిధులను శుక్రవారం విడుదల చేసిన మోడీ. దేశ ప్రధాని నరేంద్ర మోదీ   గుజరాత్ లో ప్రధాన మంత్రి కిసాన్ ఉత్సవ
బి.పి., షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత ఆరోగ్య పరీక్షలు - నవంబర్ 1న నాగర్ కర్నూల్ లో వైద్య శిబిరం: డా. మణికంఠ జగదీష్
షంషీర్ నగర్ స్మశాన వాటికలో అక్రమ షెడ్డు తొలగింపు
పోచమ్మ ఆలయ గద్దెల కూల్చివేతపై బస్తీవాసుల ఆగ్రహం!
రాళ్లతో దాడి బాధితుడికి న్యాయం చేయాలి
భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలి
పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పెద్దకొత్తపల్లి మండలం చెన్నాపురావుపల్లిలో ఇళ్ల నిర్మాణాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్